యాప్నగరం

గుజరాత్ పేలుళ్ల కీలక సూత్రధారి అరెస్ట్

గుజరాత్ మారణహోమం కీలక సూత్రధారి, ఇండియన్ ముజాయిద్దీన్ సంస్థ తీవ్రవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

TNN 22 Jan 2018, 1:17 pm
2008 గుజరాత్ బాంబు పేలుళ్ల కీలక సూత్రధారి, సిమి- ఇండియన్‌ ముజాహిదీన్‌కు చెందిన మోస్ట్‌వాంటెడ్‌ తీవ్రవాది అబ్దుల్‌ సుబాన్‌ ఖురేషిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా మారు పేరుతో అజ్ఞాతంలో ఉన్న ఖురేషి అలియాస్ తౌఖీర్‌ని పోలీసులు ఎట్టకేలకు సోమవారం అరెస్టు చేశారు. ఖురేషిని పట్టుకునే క్రమంలో పోలీసులపై అతడు కాల్పులకు యత్నించాడు. నిషేధిత సిమి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగిన ఖురేషి... 2008 జులై 26 న గుజరాత్‌లో చోటుచేసుకున్న వరుస పేలుళ్లలో ప్రధాన నిందితుడు. బాంబులు తయారుచేయడంలో దిట్ట. గుజరాత్‌తోపాటు 2006 ముంబై లోకల్ ట్రెయిన్, ఢిల్లీ, బెంగళూరులలోని బాంబు దాడులకు కూడా పాల్పడినట్లు కేసులు ఉన్నాయి. భారత బిన్‌లాడెన్‌గా పేర్కొనే ఖురేషిని జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది.
Samayam Telugu 2008 gujarat blasts mastermind arrested after decade long manhunt
గుజరాత్ పేలుళ్ల కీలక సూత్రధారి అరెస్ట్


1998లో సిమి సంస్థలో చేరిన ఖురేషి ప్రస్తుతం ఖాసిమ్‌ పేరుతో దిల్లీలో నివసిస్తున్నాడు. ఎట్టకేలకు నేడు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 2008లో అహ్మదాబాద్‌, సూరత్‌ నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 21 చోట్ల బాంబులు పేల్చారు. ఈ ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. బాంబు దాడి జరిగిన వెంటనే పేలుళ్లకు తామే బాధ్యులమని ఇండియన్ ముజాయిద్దీన్ సంస్థ ప్రకటించుకుంది. గుజరాత్ ఏటీఎస్, అహ్మదాబాద్ క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు, ఢిల్లీ ప్రత్యేక దళాలు ఖురేషి కోసం ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.