యాప్నగరం

22 ఎయిర్‌పోర్టులకు ఉగ్ర హెచ్చరికలు, అలర్ట్

దేశంలోని 22 విమానాశ్రయాల్లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.

Samayam Telugu 7 Oct 2016, 11:10 am
దేశంలోని 22 విమానాశ్రయాల్లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
Samayam Telugu 22 airports warned to be attacked security alerted
22 ఎయిర్‌పోర్టులకు ఉగ్ర హెచ్చరికలు, అలర్ట్

జమ్మూ-కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వంటి సరిహద్దు ప్రాంతాల్లోని రాష్ట్రాలతో పాటు రాజధాని ఢిల్లీ విమానాశ్రయాలను ఉగ్రవాదులు టార్గెట్ గా చేసుకున్నారని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో విమానయాన సంస్థ అన్ని ప్రభుత్వం, ప్రైవేటు ఎయిర్ పోర్టుల్లో గట్టి భద్రత చర్యలు చేపట్టాలని పోలీసు విభాగాలు, సీఐఎస్ఎఫ్, పారామిలటరీ దళాలకు లేఖలు రాశారు.
విమానాశ్రయంలోని పార్కింగులు వద్ద, చెక్ ఇన్, చెక్ ఔట్ ల దగ్గర గట్టి భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిఒక్కరిని క్షణ్ణంగా తనిఖీలు చేయాలని ఆయన అన్ని ఎయిర్ పోర్టులకు సూచించారు.
సరిహద్దు ప్రాంతాల్లో ఇండియాపై దాడులు చేసేందుకు వందమందిదాకా ఉగ్రవాదులు వ్యూహ రచన చేస్తునట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
శుక్రవారం కశ్మీర్ లోని ఖుప్వారా సరిహద్దుల నుంచి ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు తీవ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి.
సెప్టెంబర్ 29న ఇండియర్ ఆర్మీ పీవోకేలో సర్జికల్ స్ట్రైక్స్ జరిపినప్పటి నుంచి సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండగా, తీవ్రవాదులు చొరబడేందుకు ముమ్మరంగా యత్నిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.