యాప్నగరం

ప్రాణాల కోసం విలవిల.. ఫొటోల గోల, వేగంగా స్పందించి ఉంటే!

అత్యంత అమానవీయ ఘటన. రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు కాపాడమని వేడుకుంటుంటే.. ఫొటోలు తీసుకున్నారే తప్ప ఎవరూ స్పందించలేదు.

Samayam Telugu 14 Oct 2018, 12:24 am
26 ఏళ్ల ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలపాలై సాయం కోసం అర్థించాడు. కానీ, వాహనదారులెవరూ అతణ్ని పట్టించుకోలేదు. అతడు నరకయాతన అనుభవిస్తుండగా.. కొంత మంది ఫొటోలు తీసుకుంటూ గడిపారు. సుమారు గంట పాటు అతడు ప్రమాద స్థలిలోనే అచేతనంగా ఉండిపోయాడు. ఈ అమానవీయ ఘటన కర్ణాటకలోని దావణగెరెలో చోటు చేసుకుంది.
Samayam Telugu karna


ప్రమాదం జరిగిన గంట తర్వాత గానీ, బాధితుణ్ని ఆస్పత్రికి తరలించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అతణ్ని తీసుకొస్తే పరిస్థితి మరోలా ఉండేదని వైద్యులు తెలిపారు.


ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో ఎంత వేగంగా స్పందించి బాధితుడికి సాయం చేశామనే దానిపైనే ప్రాణాలు నిలిచే అంశం ఆధారపడి ఉంటుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న సమయాన్ని అనేక మంది చూస్తూ వృథా చేశారు. మనుషులం, సాటి మనిషికి సాయం చేద్దామనే విషయాన్ని కూడా మరచిపోయారు. ఇకనైనా మేల్కొంటేనే మానవత్వాన్ని బతికించిన వారమవుతాం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.