యాప్నగరం

అత్యాచార కేసు నిందితుడికి క‌రోనా.. 60 మంది పోలీసులకు తిప్పలు!

Bilaspur: రేప్ కేసులో అరెస్టైన ఓ నిందితుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో 60 మంది పోలీసులు క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు..

Samayam Telugu 6 Jul 2020, 10:38 pm
త్యాచార కేసు నిందితుడు కరోనా అలజడి సృష్టించాడు. అతడిని అరెస్టు చేసిన పాపానికి 60 మంది పోలీసులు క్వారంటైన్‌లోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలాస్‌పూర్ జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీసులు జులై 4న కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన 28 ఏళ్ల యువ‌కుడిని అత్యాచార ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని గ‌త నెల‌లో ఓ మ‌హిళ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Coronavirus for jail inmate


నిందితుడు బాబా అటామిక్ రీసెర్చ్ సెంట‌ర్ (మైసూరు యూనిట్)లో ప‌ని చేస్తున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి విచారించిన పోలీసులు అనంత‌రం జైలుకు త‌ర‌లించారు. అక్కడ క‌రోనా ప‌రీక్షలు నిర్వహించ‌గా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఆ విషయాన్ని వెంటనే సివిల్ లైన్స్ పోలీసుల‌కు ఫోన్ చేసి చెప్పారు. దీంతో 60 మంది పోలీసులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.

పోలీసు సిబ్బంది న‌మూనాల‌ను సేక‌రించి పరీక్షలకు పంపించారు. ఫలితాల గురించి వారు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిందితుడి ప్రైమరీ కాంటాక్ట్‌లపైనా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: కరోనా పాజిటివ్.. ఆస్పత్రి పైనుంచి దూకిన జర్నలిస్ట్, ఉద్యోగం నుంచి తీసేయడంతో

Must Read: కరోనా మరణాలు తగ్గించడంలో ఆ మందులు విఫలం.. నిషేధించిన WHO

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.