యాప్నగరం

పుల్వామాలో ముగ్గురు తీవ్రవాదుల్ని హతమార్చిన సైన్యం

జమ్మూ కశ్మీర్‌లో సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. శనివారం సాయంత్రం పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు.

Samayam Telugu 1 Jul 2018, 11:25 am
జమ్మూ కశ్మీర్‌లో సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. శనివారం సాయంత్రం పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. పుల్వామా జిల్లా తుమ్నా గ్రామంలో ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం అందుకున్న భదత్ర దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో సైన్యాన్ని అడ్డుకోడానికి అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. దీంతో సైనికులు వారిపై కాల్పులు జరపడంతో ఓ పౌరుడు సైతం ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాదులను దాగి ఉన్న ఇంటిని భద్రతా బలగాలు కచ్చితంగా గుర్తించినా, అందులో పౌరులు కూడా ఉండటంతో ఆపరేషన్‌ కొంత ఆలస్యమైంది. అక్కడ నుంచి స్థానికులను చెదరగొట్టడంతో ఉగ్రవాదులు, సైనికుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ముష్కరుల కాల్పుల్ని తప్పికొట్టిన సైన్యం ముగ్గురు ఉగ్రవాదులనూ హతమార్చింది.
Samayam Telugu కశ్మీర్ ఎన్‌కౌంటర్


ఇదే సమయంలో అల్లరి మూకలు కూడా జవాన్లపై దాడులకు ప్రయత్నించాయి. వారిపై సైనికులు రబ్బరు బుల్లెట్టు ప్రయోగించడంతో ఐదురుగు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన ఫైజాన్ అహ్మద్ ఖాన్ (16) అనే యువకుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాలు హెచ్చరికలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జూన్ 28 న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 26 వరకు కొనసాగనుంది. ఈ యాత్ర కోసం వివిధ విభాగాలకు చెందిన దాదాపు 40 వేల మంది సైనికులు, పోలీసులు భద్రత విధుల్లో పాల్గొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.