యాప్నగరం

ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారుల దుర్మరణం!

అత్యంత దయనీయమైన విషాదమిది.. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారులు మృతి చెందారు..

TNN 11 Aug 2017, 8:25 pm
ఉత్తరప్రదేశ్‌లో అత్యంత దయనీయమైన విషాదం చోటు చేసుకుంది. ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారులు మృతి చెందారు. గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ (బాబా రాఘవ్ ‌దాస్ మెడికల్ కాలేజ్) ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. చిన్నారులందరూ మెదడు సంబంధిత వ్యాధి (ఎన్‌సెఫలైటిస్)తో బాధపడుతున్నారు. హాస్పిటల్‌లో ఆక్సిజన్ కావాల్సిన స్థాయిలో అందుబాటులో లేదని, ఈ విషయాన్ని పైఅధికారులకు చెప్పినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆక్సిజన్ అందుబాటులో లేని కారణంగా.. గత 48 గంటల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 30 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని కలెక్టర్ తెలిపారు.
Samayam Telugu 30 dead due to encephalitis in last 48 hours at gorakhpur hospital
ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారుల దుర్మరణం!


ఈ ఘటనపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గోరఖ్‌పూర్.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. ఆయన ఆ నియోజకవర్గం నుంచి వరసగా 5 సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. సీఎం పదవి చేపట్టిన నేపథ్యంలో ఆగస్టు 5న ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.