యాప్నగరం

కేజ్రీవాల్‌కు షాక్: ఢిల్లీ సీఎంగా కుమార్ విశ్వాస్!

వలసతో బెంబేలెత్తిపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగలనుందా?

Samayam Telugu 29 Apr 2017, 6:21 pm
వలసతో బెంబేలెత్తిపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగలనుందా? సీఎం పోస్ట్ నుంచి ఆయన్ను తొలగించి మరో నేతను ఎన్నుకునేందుకు ‘కుట్ర’ జరుగుతోందా? బీజేపీ అధికార ప్రతినిధి తాజిందర్ పాల్ ఎస్ బగ్గా మాత్రం ఇది నిజమే అంటున్నారు. ‘ఆప్’ పార్టీకి చెందిన 34 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ ను దించి అధికార ప్రతినిధి కుమార్ విశ్వాస్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని వ్యూహరచ చేస్తున్నట్లు బగ్గా వ్యాఖ్యానించారు.
Samayam Telugu 34 aap mlas want to see kumar vishvas as delhi cm bjp leader
కేజ్రీవాల్‌కు షాక్: ఢిల్లీ సీఎంగా కుమార్ విశ్వాస్!


34 మంది ఆప్ ఎమ్మెల్యే కుమార్ విశ్వాస్ ను సీఎంగా చూడాలని అనుకుంటున్నట్లు తాను విన్నానని బగ్గా ట్వీట్ చేశారు. దీంతో ఢిల్లీ రాజకీయాల్లో ఇదో చర్చనీయాంశమైంది.

Heard 34 AAP MLAs want to see Dr Kumar Vishwas as Delhi CM. Interesting— Tajinder Pal S Bagga (@TajinderBagga) April 29, 2017
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఓడిపోయిన నేపథ్యంలో కుమార్.. కేజ్రీవాల్ తీరును ఎండగట్టారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, ఓటర్లకు పార్టీకి మధ్య కమ్యూనికేషన్ తెగిపోయిందని వ్యాఖ్యానించారు.

తప్పులు చేశాం. సమీక్షించుకుంటామని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.