యాప్నగరం

ఢిల్లీలో భూకంపం.. జాగ్రత్తగా ఉండండి అంటూ సీఎం కేజ్రీవాల్ ట్వీట్

దేశరాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించగా... గురుగ్రామ్ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

Samayam Telugu 3 Jul 2020, 10:19 pm
దేశ రాజధాని వాసులను భూప్రకంపనలు భయపెట్టాయి. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని భారత వాతావరణ విభాగం తెలిపింది. హర్యానాలోని గురుగ్రామ్‌కు 63 కిలోమీటర్ల దూరంలో 53 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు.
Samayam Telugu earthquake


ఏప్రిల్ నుంచి ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో స్వల్ప, మధ్యస్థాయి తీవ్రతతో 15 సార్లకుపైగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జూన్ 8న ఢిల్లీలో రిక్టర్ స్కేల్‌పై 2.1 తీవ్రతతో భూకంపం సంభవించింి. మే 29న 4.6 తీవ్రతో ఢిల్లీలో భూంకంపం రాగా.. హర్యానాలోని రోహ్‌తక్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

మే 15న 2.2 తీవ్రతతో భూకంపం రాగా న్యూఢిల్లీకి నైరుతి దిశగా 13 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మే 10న ఉత్తర ఢిల్లీలోని వజీర్‌పూర్ సమీపంలో 3.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.

ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భూప్రకంపనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అప్ఘానిస్థాన్‌లోని హిందూకుష్ పర్వతాలు, నేపాల్‌లో భూకంపం వచ్చినప్పటికీ.. ఢిల్లీలోనూ ప్రకంపనలు వస్తుంటాయి.

‘‘కాసేపటి క్రితం ఢిల్లీలో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మీరంతా క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నా. జాగ్రత్తగా ఉండండి’’ అని సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.