యాప్నగరం

ఉత్తరాఖండ్ ప్రమాదం: 47కి చేరిన మృతుల సంఖ్య!

ఉత్తరాఖండ్‌లోని పౌరీగర్వాల్ జిల్లాలో జరిగిన ఘోర బస్సుప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 47కి చేరింది. భోహన్ నుంచి రామ్‌నగర్ మీదుగా ప్రయాణికులతో వెళ్తున్న 28 సీట్లు ఉన్న బస్సు ఓవర్‌లోడ్‌ కారణంగా అదుపుతప్పి ఆదివారం (జులై 1) ఉదయం లోయలో పడిపోయింది.

Samayam Telugu 1 Jul 2018, 4:26 pm
ఉత్తరాఖండ్‌లోని పౌరీగర్వాల్ జిల్లాలో జరిగిన ఘోర బస్సుప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 47కి చేరింది. 11 మంది వరకు గాయపడ్డారు. భోహన్ నుంచి రామ్‌నగర్ మీదుగా ప్రయాణికులతో వెళ్తున్న 28 సీట్లు ఉన్న బస్సు ఓవర్‌లోడ్‌ కారణంగా అదుపుతప్పి ఆదివారం (జులై 1) ఉదయం 60 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది అక్కడిక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడినవారిని విమానంలో డెహ్రాడూన్‌కు తరలించారు. వీరు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మృతుల సంఖ్య 47కి చేరింది. మిగతావారిని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu bus


ప్రమాదం సమయంలో బస్సులో 58 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున నష్ట పరిహారాన్ని సీఎం రావత్ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్‌కు తరలించాల్సిందిగా ఆదేశించారు.

బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్టు పీఎంఓ కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. గాయపడ్డవారంతా త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.