యాప్నగరం

ఎస్పీ నేత కుమార్తెతో వెళ్లిపోయిన 47 ఏళ్ల బీజేపీ నేత

BJP leader elopes with SP leader daughter: ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎస్పీ నేత కుమార్తెతో బీజేపీ నేత వెళ్లిపోయారు. ఆ అమ్మాయికి 26 ఏళ్లు కాగా.. బీజేపీ నేతకు 47 ఏళ్లు. బీజేపీ నేతకు అప్పటికే 21 ఏళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఈ ఘటన సంచలనంగా మారింది. విపక్ష నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 18 Jan 2023, 7:14 pm
ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. 47 ఏళ్ల బీజేపీ నాయకుడు సమాజ్‌వాదీ పార్టీ నాయకుడి 26 ఏళ్ల కుమార్తెతో వెళ్లిపోయాడు. ఆ నాయకుడిని ఆశిష్ శుక్లాగా గుర్తించారు. శుక్లాతో 26 ఏళ్ల యువతి కొంత కాలంగా రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. శుక్లాకు అప్పటికే పెళ్లై 21 ఏళ్ల కుమారుడు, 7 ఏళ్ల కుమార్తె ఉన్నారు. శుక్లాతో కలిసి వెళ్లిన యువతికి.. ఆమె తండ్రి అయిన ఎస్పీ నేత ఇటీవలే మరో యువకుడితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఆ పెళ్లి ఇష్టంలేక ఆమె.. శుక్లాతో పారిపోయినట్లు స్థానిక మీడియా కథనాల్లో పేర్కొన్నారు.
Samayam Telugu 26 year old girl elopes with 47 year old man
ప్రతీకాత్మక చిత్రం


యువతి తండ్రి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వారిద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ‘అమ్మాయి కుటుంబం ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె పెళ్లిని నిర్ణయించింది. అయితే, అప్పటికే ఆమెకు శుక్లాతో ఎఫైర్‌ ఉంది. చివరకు ఆమె పెళ్లికి దూరంగా పారిపోవాలని నిర్ణయించుకుంది’ అని స్థానిక కథనాల్లో పేర్కొన్నారు.


ఆశిష్ శుక్లా.. బీజేపీ పార్టీ నగర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నట్లు ఆ పార్టీ హర్దోయ్ జిల్లా మీడియా ఇన్‌చార్జి గంగేష్ పాఠక్ మీడియాకు తెలిపారు. పార్టీ విధానాలకు విరుద్ధంగా పని చేసినందుకు, పార్టీ విధుల్లో అలసత్వం వహించినందున ఆశిష్‌ను పదవి నుంచి తొలగించినట్లు ఆయన వెల్లడించారు. పార్టీ నుంచి శుక్లా ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసినట్లు తెలిపారు. ఇకపై పార్టీతో అతడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అతడిపై చర్య తీసుకునేందుకు పోలీసులకు పూర్తి అధికారం ఉందని గంగేష్ పాఠక్ అన్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.