యాప్నగరం

వీడియో: ఒకే బైక్‌పై 58 మంది.. ఆర్మీ అద్భుత ఫీట్

ఒకే బైక్ పై 28 కాదు, 54 కాదు.. ఏకంగా 58 మంది జవాన్లు ప్రయాణించారు. అది కూడా కిలోమీటరుకు పైగా దూరం వరకూ అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకుసాగారు. బెంగళూరులోని యెలహంక ఎయిర్ బేస్‌ ఈ అరుదైన ఫీట్‌కు వేదికైంది. ఇండియన్ ఆర్మీకి చెందిన మోటార్ సైకిల్ విభాగం ‘టోర్నడోస్’ ఆదివారం (నవంబర్ 19) ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది.

TNN 21 Nov 2017, 8:39 pm
భారత జవాన్లు బైక్‌తో అరుదైన ఫీట్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఒకే బైక్ పై 28 కాదు, 54 కాదు.. ఏకంగా 58 మంది ప్రయాణించారు. అది కూడా కిలోమీటరుకు పైగా దూరం వరకూ అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకుసాగారు. బెంగళూరులోని ఎలహంక ఎయిర్ బేస్‌ ఈ అరుదైన ఫీట్‌కు వేదికైంది. ఇండియన్ ఆర్మీకి చెందిన మోటార్ సైకిల్ విభాగం ‘టోర్నడోస్’ ఆదివారం (నవంబర్ 19) ఈ అద్భుతాన్ని ఆవిష్కరించి అందర్నీ అబ్బురపరిచారు. గతంలో ఒకే బైక్‌పై 54 మంది ప్రయాణించి నెలకొల్పిన రికార్డును ఆర్మీ తిరగరాసింది. అంతకంటే ముందు 28 మందితో ప్రపంచ రికార్డు ఉండేది.
Samayam Telugu 58 men on a single motorbike indian army creates guinness record
వీడియో: ఒకే బైక్‌పై 58 మంది.. ఆర్మీ అద్భుత ఫీట్


500 సీసీ రాయల్ ఎన్‌‌ఫీల్డ్ బైక్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఈ ఫీట్ చేశారు. దానికి ప్రత్యేకంగా కొన్ని ఇనుప రాడ్లు అమర్చారు. దానిపై ఒకేసారి 58 మంది ఎక్కి 1200 మీటర్లు ప్రయాణించారు. జాతీయ జెండాలోని మూడు రంగులను ప్రదర్శించే విధంగా దుస్తులు ధరించి ఈ ఫీట్ నిర్వహించారు.

ఈ ఫీట్‌ను సాధ్యం చేయడానికి కొంత కాలంగా తీవ్రంగా శ్రమించామని, అనేక పర్యాయాలు రిహార్సల్స్ చేశామని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆర్మీ చేసిన ఈ అరుదైన ఫీట్‌ను చూసేందుకు వేలాది మంది తరలి వచ్చారు. ఆ అద్భుతమైన ఫీట్‌ను వీడియోలో మీరూ చూడవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.