యాప్నగరం

38 ఏళ్ల కుమారుడికి మళ్లీ జన్మనిచ్చిన అమ్మ.. కొవిడ్ ఆస్పత్రిలో అద్భుతం

Kolkata: కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న 38 ఏళ్ల కుమారుడికి 65 ఏళ్ల వయసులో కిడ్నీ దానం చేసి ప్రాణాలు నిలబెట్టారు ఓ తల్లి. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ తల్లీ బిడ్డలకు కోల్‌కతా ఆస్పత్రిలో విజయవంతంగా సర్జరీ నిర్వహించారు.

Samayam Telugu 13 Jul 2020, 1:16 am
వమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది అమ్మ. ఆ బిడ్డ ప్రాణానికి ఏదైనా ఇబ్బంది తలెత్తితే తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుకుంటుంది. అలాంటి తల్లి ప్రేమకు తార్కణాలెన్నో. కిడ్నీ విఫలమై చావుకు దగ్గరైన తన కొడుకు ప్రాణాలు నిలబెట్టడానికి ఓ తల్లి 65 ఏళ్ల వయసులో సాహసం చేసింది. తన కిడ్నీలలో ఒకదాన్ని దానం చేసి 38 ఏళ్ల కొడుక్కి పునర్జన్మ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఈ ఘటన జరిగింది.
Samayam Telugu కిడ్నీ దానం చేసి కుమారుడిని కాపాడిన మహిళ
Mother Donates Kidney To Son In Kolkata


బంగ్లాదేశ్‌కు చెందిన ఆ తల్లీకుమారులిద్దరికీ బెంగాల్ వైద్యులు సర్జరీ చేసి విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నిర్వహించారు. వారిద్దరూ కొవిడ్ మహమ్మారిని జయించిన తర్వాత ఈ ఆపరేషన్ చేయడం మరో విశేషం.

కుమారుడు చాలా కాలంగా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నాడు. ప్రాణాలకు ప్రమాదంగా మారిన దశలో తన బిడ్డను కాపాడుకోవడానికి 65 ఏళ్ల ఆ తల్లి సిద్ధమయ్యారు. కోల్‌కతా ఆస్పత్రిలో వైద్యులు జులై 3న కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ పరీక్ష నిర్వహించారు. దేశంలో కొవిడ్ రోగులకు ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తొలి ఘటన ఇదేనని వైద్యులు చెబుతున్నారు.

అసలే కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న కుమారుడికి కరోనా సోకడంతో ఆ తల్లి మరింత కుంగిపోయారు. కొవిడ్ బారినపడి చికిత్స తీసుకున్న వారిద్దరికీ జూన్ 12న నెగటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే.. వైద్యులు మరో రెండు వారాల పాటు వారిని క్వారంటైన్‌లో ఉంచిన తర్వాత కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.