యాప్నగరం

ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురి మృతి

Ghaziabad: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మోదీ నగర్‌లో ఘోర విషాదం నెలకొంది. కర్మాగారంలో పేలుడు సంభవించి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు.

Samayam Telugu 5 Jul 2020, 6:48 pm
త్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మోదీనగర్‌లోని ఓ కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మరణించగా... మరో నలుగురు గాయపడ్డారు. మోదీన‌గ‌ర్ త‌హ‌సీల్ ప‌రిధిలో ఉన్న ఈ క‌ర్మాగారం.. కొవ్వొత్తులు తయారీకి సంబంధించినది తెలుస్తోంది. కర్మాగారంలో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలకు నిప్పు అంటుకోగా ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. ఆదివారం (జులై 5) మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Samayam Telugu ఘజియాబాద్ పేలుడు
Ghaziabad Blast


ఘటన జరిగిన సమయంలో కర్మాగారంలో 20 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. 12 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.


జనావాసాల మధ్య ప్యాక్టరీని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించి, ఆ వెంటనే మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు ఫ్యాక్టరీ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు.

Also Read: మట్టి కింద 162 మంది సమాధి.. మయన్మార్‌లో ఘోర విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.