యాప్నగరం

ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైందిగా.. మోదీ ప్రభుత్వం

ఎన్డీయే ప్రభుత్వంపై దేశ ప్రజలు అత్యంత విశ్వాసం కలిగి ఉన్నట్లు ఓ సర్వే తేల్చి చెప్పింది. దాదాపు 73 శాతం మంది భారతీయులు..

TNN 14 Jul 2017, 10:12 pm
ఎన్డీయే ప్రభుత్వంపై దేశ ప్రజలు అత్యంత విశ్వాసం కలిగి ఉన్నట్లు ఓ సర్వే తేల్చి చెప్పింది. దాదాపు 73 శాతం మంది భారతీయులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఎక్కువగా నమ్మకం ఉంచినట్లు ఓఈసీడీ అనే సంస్థ నిర్వహించిన సర్వే ద్వారా వెల్లడైంది. అంతేకాకుండా.. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రపంచంలోనే విశ్వసనీయమైందిగా నిలవడం విశేషం. అగ్రరాజ్యమైన అమెరికాలోని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంపై కేవలం 30 శాతం మందికి మాత్రమే విశ్వాసం ఉందట.
Samayam Telugu 73 indians have confidence in modis leadership oecd survey
ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైందిగా.. మోదీ ప్రభుత్వం


భారత్‌ తర్వాతి స్థానంలో కెనడా ప్రభుత్వం ఉంది. ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వంపై 62 శాతం మంది ప్రజలు విశ్వాసం ఉంచారు. తర్వాతి స్థానంలో టర్కీ (58 శాతం), రష్యా (58 శాతం), జర్మనీ (55 శాతం) ప్రభుత్వాలు ఉన్నాయి. గతేడాది బ్రెగ్జిట్‌ సంక్షోభం నేపథ్యంలో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన థెరిసా మే ప్రభుత్వంపై 41 శాతం మంది ప్రజలు విశ్వాసం ఉంచడం గమనార్హం.

మరోవైపు అవినీతి కుంభకోణంలో చిక్కుకున్న దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌ హై కారణంగా ఆ దేశ ప్రభుత్వంపై కేవలం 25 శాతం మంది ప్రజలే విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత అధికార ప్రభుత్వం స్థిరంగా ఉండగలదా.. లేదా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే చేపట్టారు. అత్యవసర పరిస్థితులు వచ్చినపుడు ప్రభుత్వం ప్రజలను రక్షించగలుగుతుందా.. సేవలను సమర్థంగా అందిస్తోందా.. తదితర అంశాలను తీసుకొని ఈ సర్వే నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.