యాప్నగరం

89 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ.. స్వాతంత్ర్య సమర యోధుడి ఘనత

89 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పూర్తి చేసిన స్వాతంత్ర్య సమర యోధుడు.

Samayam Telugu 10 Sep 2018, 8:17 pm
చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించారో పెద్దాయన. 89 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ పూర్తి చేసి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలోని కొప్పాల్‌కు చెందిన శరణబస్వరాజ్ బిస్రాహలీ స్వాతంత్ర్యం సమర యోధుడు. చదువంటే ప్రాణం భావించే ఈ పెద్దాయన.. హంపి కన్నడ వర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి.. కర్ణాటక వర్శిటీ నుంచి ‘లా’లో పీజీ చేశారు. తర్వాత పీహెచ్‌డీ అడ్మిషన్ తీసుకున్న ఆయన.. గతేడాది పరీక్షలు రాసినా ఉత్తీర్ణత సాధించలేకపోయారు.

ఈ ఏడాది ఎలాగైనా పీహెచ్‌డీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పట్టుదలతో అనుకున్నది సాధించారు. బస్వరాజ్‌ పద్యాలు, సాహిత్యానికి సంబందించిన పుస్తకాలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. 89 వయసులో కష్టపడి పీహెచ్‌డీ సాధించిన బస్వరాజ్‌ను అందరూ అభినందిస్తున్నారు. పెద్దాయన మీరు గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.