యాప్నగరం

సొంతింట్లోనే చోరీ చేస్తూ పట్టుబడ్డ ప్రబుద్ధుడు..!

బీహార్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సొంతింట్లోనే చోరీకి పాల్పడ్డాడు. అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన వ్యక్తి అత్తమామలతోనే ఉంటున్నాడు. దాంతో తన ఆస్తిలో భాగంగా కావాలని కుటుంబ సభ్యులను అడిగాడు. వాళ్లు ఇవ్వడానికి నిరాకరించడంతో మరో పదిమందితో కలసి సొంత ఇంట్లోనే దోపిడీకి వెళ్లాడు. రూ.4 లక్షల విలువ చేసే వస్తువులతో ఉడాయించే సమయంలో గ్రామస్థులు వారిని పట్టుకున్నారు. అయితే అందులో చాలామంది తప్పించుకుని పారిపోయారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 4 May 2022, 7:04 pm

ప్రధానాంశాలు:

  • బీహార్‌లో షాకింగ్ ఘటన
  • సొంతింటికి కన్నం వేసిన వ్యక్తి
  • పదిమందితో కలసి దోపిడీకి యత్నం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతికాత్మక చిత్రం
బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఓ షాకింగ్ ఘటనలో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి సొంతింటికే కన్నం వేశాడు. తన ఇంట్లో తనే చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి పది మందితో కలసి పూర్ణియా జిల్లాలోని పురబ్ తోలా గ్రామంలోని ఇంట్లో రూ.4 లక్షల విలువ వస్తువులను ఎత్తుకెళ్లిపోతుండగా దొరికిపోయాడు. రెడ్‌హ్యాండ్‌డ్‌గా పట్టుకున్న ఆ దొంగ ముఖం చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ దొంగ ఎవరో కాదు ఆ ఇంటి యజమాని కొడుకు. తన ఇంట్లోనే చోరీ చేయడానికి వచ్చాడు.
అయితే సొంత ఇంట్లోనే చోరీ చేయడానికి కారణం లేకపోలేదు. నిందితుడు నూర్ ఆలం కిషన్ గంజ్ జిల్లాలోని ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దాంతో తల్లిదండ్రులు అతన్ని ఇంటి నుంచి గెంటేశారు. దాంతో ఆలం తన అత్తమామలతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆస్తిలో తన వాటా ఇవ్వమని తల్లిదండ్రులను కోరాడు. వారు పట్టించుకోలేదు. చాలా రోజులుగా ప్రాధేయపడినా కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో సహచరులతో కలిసి దోపిడీకి పథకం వేశాడు.

ఇంట్లో ప్రతిమూల బాగా తెలిసిన నూర్ ఆలం పది మంది సహచరులతో కలిసి ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లోని రూ.4 లక్షల విలువైన వస్తువులను దొంగిలించాడు. వస్తువులను పట్టుకుని పారిపోతున్న సమయంలో దొంగలను గ్రామస్థులు చుట్టుముట్టారు. అయితే ఆలం మినహా మిగతావారు తప్పించుకున్నారు. చివరికి పట్టుబడ్డ ఆ వ్యక్తి మొహాన్ని చూడగా గ్రామస్థులు షాక్ అయ్యారు. ఈ ఘటనలో నూర్ ఆలం, అతని సహచరులు దోచుకున్న సుమారు నాలుగు లక్షల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాగా గతంలో ముంబైలో కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.