యాప్నగరం

National Flag: ఆకట్టుకుంటున్న జెండా... కూరగాయల వ్యాపారి క్రియేటివిటికి ఫిదా

75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవాన్ని (National Flag) ఘనంగా నిర్వహించుకునేందుకు దేశం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు కేంద్రం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ప్రతి ఇంట్లో జెండా ఎగురవేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ పిలుపును దేశ ప్రజలు అందిపుచ్చుకున్నారు. ఈ జెండా పండుగ కోసం ప్రత్యేకంగా షాపింగ్ కూడా చేస్తున్నారు. తమ ఇళ్లలో పెట్టుకోవడానికి జెండాలను కొంటున్నారు. అయితే ఓ కూరగాయల వ్యాపారి మాత్రం తమ దగ్గర ఉన్న వాటితోనే జెండాను రూపొందించాడు.

Authored byAndaluri Veni | Samayam Telugu 12 Aug 2022, 1:26 pm

ప్రధానాంశాలు:

  • ప్రతి ఇంట జెండా ఎగురవేయాలని ప్రధాని పిలుపు
  • క్యారెట్, ముల్లంగిలతో జెండా తయారీ
  • కంటిలో జెండాను వేసుకున్న ఓ కళాకారుడు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu National Flag
National Flag: దేశ వ్యాప్తంగా 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప్రతి ఇంట త్రివర్ణ పతాకం పెట్టుకోవాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు తమ ఇళ్లలో కూడా జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ పిలుపుని ఇప్పటికే చాలామంది ప్రజలు అందిపుచ్చుకున్నారు. ఈ జెండా పండుగ కోసం ప్రత్యేకంగా షాపింగ్ కూడా చేస్తున్నారు. తమ ఇళ్లలో పెట్టుకోవడానికి జెండాలను కొంటున్నారు. ఇప్పటికే నగరాల్లో అనేక భవనాలు జాతీయ జెండా లైటింగ్‌లతో మెరిసిపోతున్నాయి.

అయితే ఒక కూరగాయల విక్రేత మాత్రం చాలా వినూత్నంగా ఆలోచించాడు. జెండా కోసం ప్రత్యేకంగా ఏది కొనుగోలు చేయలేదు. కేవలం తన దగ్గర ఉన్న కూరగాయలతోనే భారతీయ జెండాలాంటి రూపాన్ని సృష్టించాడు. తన దేశభక్తిని చాటిచెప్పుకున్నాడు. ఆ వ్యాపారి సృజనాత్మకతతో తయారు చేసిన జెండా రూపం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేవలం క్యారెట్, ముల్లంగి, బెండకాయలతో జెండాను తయారు చేశాడు. అదే ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.


కాగా ఇంకో కళాకారుడు కూడా జెండాను వినూత్నంగా చిత్రించి.. అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అద్భుతంగా త్రివర్ణ పతాకం పెయింట్ వేయాలనుకున్నాడు. అందులో భాగంగా జాతీయ జెండాను కంటిలో రూపొందించుకున్నాడు. తమిళనాడుకు చెందిన రాజా అనే వ్యక్తి ఈ సాహసానికి పూనుకున్నాడు. కంటిలో జెండాను వేసుకోవడం అంత ఆషామాషిగా జరగలేదు. చాలా కష్టపడాల్సి వచ్చింది. అద్దంలో చూసుకుంటూ తనకు తానే వేసుకున్నాడు. 16 సార్లు ప్రయత్నించి.. 17వ సారి విజయవంతంగా పూర్తి చేశాడు. అయితే రాజా అనేక సూక్ష్మ కళా చిత్రాలను వేసి.. ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఆ అనుభవంతోనే ఇప్పుడు కంటిలో జెండా పెయింట్ వేసుకున్నాడు. అయితే డాక్టర్లు మాత్రం ఇలా చేయడం ప్రమాదకరం అంటున్నారు.

Read Also:వికలాంగ వ్యక్తిపై దాడి... కర్రతో బెదిరించి.. కాళ్లను నొక్కించి...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.