యాప్నగరం

#MeToo ఎఫెక్ట్: నన్నే వేధిస్తావా అంటూ చితకబాదింది

ఏంటి నోరు తెరిచి సమాధానం చెప్పు అంటూ మేనేజర్‌ను కర్రను చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Samayam Telugu 15 Oct 2018, 11:00 pm
‘మీటూ’ ఉద్యమం ప్రభావంతో బాధిత మహిళలు ఒక్కొక్కరుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బహిర్గతం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా #MeToo ప్రకంపనలు రేపుతున్న తరుణంలో కర్ణాటకలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే నన్నే వేధిస్తావా నీకెంత ధైర్యమంటూ మహిళ శివంగిలా మారిపోయింది. సదరు వ్యక్తిని కర్ర విరిగేలా కొడుతూ చుక్కలు చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Samayam Telugu Woman Thrashes


ఓ మహిళ లోన్ కావాలని దేవనగెరెలోని ఓ బ్యాంకుకు వెళ్లింది. అయితే బ్యాంకు మేనేజర్ లోన్ ఇస్తానని, అయితే తాను చెప్పినట్లు చేయాలని వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. బ్యాంకు బయటకు తీసుకువచ్చి మేనేజర్‌ను కర్రతో చితకబాదింది. ‘నన్నే వేధిస్తావా.. నీకెంత ధైర్యం.. మీ హెడ్ ఎవరు ఫోన్ చేయ్ అంటూ.. ఆడవాళ్లంటే అంత చులకనా నీకు’ అంటూ గద్దిస్తూ అతడిని మహిళ కొట్టసాగింది. అక్కడ గుమిగూడిన జనాలు తమ సెలఫోన్లకు పని చెప్పారు. ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఆ మేనేజర్ మాత్రం తప్పు ఒప్పుకున్నట్లుగా ఏం మాట్లాడకుండా తన్నులు తిన్నాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్దాం పదా అంటూ అతడిని హతలెత్తించింది. మీటూ వ్యాప్తంగా మీటూ ఉద్యమం నడుస్తుండగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో విపరీతంగా షేర్ అవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.