యాప్నగరం

షాహీన్‌బాగ్ తీర్పు.. కమలానికి కళ్లు తిరిగేలా..

అందరూ ఊహించిన దాని కంటే ఎక్కువగా ఢిల్లీ ఎన్నికల్లో అర్వింద్ కేజ్రీవాల్‌ అఖండ విజయం సాధించారు. మొత్తం 70కి గాను 62 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయదుంధుబి మోగించింది. అయితే కొందరి దృష్టి మాత్రం ఒక ప్రాంతంపై పడింది. అదే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిస్తున్న ‘షాహిన్‌బాగ్’. ఓఖ్లా అసెంబ్లీ నియోజకర్గ పరిధిలో షాహిన్‌బాగ్ ఉంటుంది. ఈ స్థానంలో ఆప్ అఖండ విజయం సాధించింది. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కనీసం దరిదాపుల్లో కూడా లేని అద్భుత మెజారిటీ సాధించింది. ఆప్ అభ్యర్థి అమానాతుల్లా ఖాన్ దాదాపు 71 వేల మెజారిటీ సాధించారు.

Samayam Telugu 12 Feb 2020, 12:07 am
అందరూ ఊహించిన దాని కంటే ఎక్కువగా ఢిల్లీ ఎన్నికల్లో అర్వింద్ కేజ్రీవాల్‌ అఖండ విజయం సాధించారు. మొత్తం 70కి గాను 62 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయదుంధుబి మోగించింది. అయితే కొందరి దృష్టి మాత్రం ఒక ప్రాంతంపై పడింది. అదే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిస్తున్న ‘షాహిన్‌బాగ్’. ఓఖ్లా అసెంబ్లీ నియోజకర్గ పరిధిలో షాహిన్‌బాగ్ ఉంటుంది. ఈ స్థానంలో ఆప్ అఖండ విజయం సాధించింది. ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కనీసం దరిదాపుల్లో కూడా లేని అద్భుత మెజారిటీ సాధించింది. ఆప్ అభ్యర్థి అమానాతుల్లా ఖాన్ దాదాపు 71 వేల మెజారిటీ సాధించారు.
Samayam Telugu aam aadmi party huge victory in shaheen bagh located in okhla constituency over bjp
షాహీన్‌బాగ్ తీర్పు.. కమలానికి కళ్లు తిరిగేలా..



మోదీతో ఉంటారా.. పాకిస్థాన్ వైపా?

బీజేపీ ఎన్నికల ప్రచారం మొత్తం షాహీన్‌బాగ్ చుట్టే నడిచింది. షాహీన్‌బాగ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా వేలాది మంది రోజూ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో దాదాపు 60 స్థానాల్లో ప్రచారం నిర్వహించిన కేంద్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సర్జికల్ స్ట్రైక్స్‌తో పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ప్రధాని మోదీ వైపు ఉంటారా? లేక షాహీన్ బాగ్ వెనుక ఉన్న వారి వైపు (పాకిస్థాన్) ఉంచటారా? ప్రజలు నిర్ణయించుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బిర్యానీలు తినిపిస్తున్నారంటూ..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయితే షాహీన్‌బాగ్‌లోని సీఏఏ నిరసనకారులకు కేజ్రీవాల్ బిర్యానీ పెట్టి పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు కూడా శ్రుతిమించి విమర్శలకు దిగారు. షాహీన్‌బాగ్‌లో లక్షలాది మంది ఆందోళనలు చేస్తున్నారని.. వారంతా మీ ఇళ్లల్లోకి ప్రవేశించి మీ కూతుర్లు, చెల్లెలను రేప్ చేస్తారని, చంపేస్తారని.. అందుకే ఆలోచించి ఓటేయాలని బీజేపీ ఢిల్లీ వెస్ట్ ఎంపీ పర్వేశ్ వర్మ ఎన్నికల ముందు సంచలన ఆరోపణలు చేశారు. షాహీన్ బాగ్‌లో పాకిస్థానీలు చేరిపోయారని, అదో మినీ పాకిస్థాన్‌లా మారిందని బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా వ్యాఖ్యానించారు. భారత చట్టాలు షాహీన్‌బాగ్‌, చాంద్‌బాగ్, ఇంద్రలోక్‌లో పనిచేయడం లేదని, అల్లర్లు సృష్టించేందుకు పాకిస్థానీలు ఢిల్లీ రోడ్లపైకి వచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

కేజ్రీవాల్ సంయమనం

అయితే షాహీన్‌బాగ్ ఆందోళనలకు కేజ్రీవాల్ దూరంగానే ఉన్నారు. వారికి ఆందోళన, నిరసన చేసే హక్కు ఉందని.. అయితే, ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తాను అక్కడికి వెళ్లాలంటే తనకు 5 నిమిషాలు కూడా పట్టదని అన్నారు. వివాదాస్పద అంశాల చుట్టూ సాగిన ప్రచారం ముగిసిన అనంతరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగగా.. 11న ఫలితాలు వెలువడ్డాయి.

ఆప్‌కు కళ్లు చెదిరే మెజారిటీ

ఓఖ్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే అమానాతుల్లా ఖాన్ పోటీకి దిగగా, బీజేపీ అభ్యర్థిగా బ్రహమ్ సింగ్, కాంగ్రెస్ అభ్యర్థిగా పర్వేజ్ హష్మి రంగంలోకి దిగారు. భారత ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం ఆప్ అభ్యర్థికి 1,30,367 ఓట్లు పోలవగా, రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థికి కేవలం 58,540 ఓట్లు పోలయ్యాయి. దీంతో 71,827 మెజారిటీ ఆప్ అభ్యర్థి అఖండ విజయం సాధించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ పర్వేజ్ హష్మి కేవలం 5,123 ఓట్లు సాధించి డిపాజిట్ గల్లంతయ్యారు.

గెలుపుపై ఆప్ ఎమ్మెల్యే ఏమన్నారంటే..

అమిత్‌షా వ్యాఖ్యలకు ఎన్నికల ఫలితాలే గట్టి సమాధానమిచ్చాయని అమానాతుల్లా ఖాన్ అన్నారు. బీజేపీకి, అమిత్‌షాకు ఢిల్లీ ప్రజలు తమ తీర్పుతో షాక్ ఇచ్చారని పేర్కొన్నారు. ఈవీఎం బటన్లు బలంగా నొక్కితే ఆ షాక్ షహీన్‌బాగ్‌కు వినిపించాలని ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఓటర్లకు ఇచ్చిన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అమిత్ షా వ్యాఖ్యలకు అమానాతుల్లా ఖాన్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. కాగా, ఎమ్మెల్యే అమానాతుల్లా ఖాన్‌ను గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోలీసులు పలుమార్లు అరెస్టు చేయడం గమనార్హం.

Twitter-barkha dutt

Twitter-Sb²

Twitter-Sb²

Twitter-Faiz Abbas Abidi

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.