యాప్నగరం

హవాలా కేసులో ఆప్ మంత్రి!

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. తాజాగా మరో మంత్రి హవాలా కేసులో చిక్కుకుని విచారణ ఎదుర్కొంటున్నట్లు వస్తున్న వార్తలతో ఆయన ఉక్కరిబిక్కిరి అవుతున్నారు.

TNN 27 Sep 2016, 2:37 pm
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. తాజాగా మరో మంత్రి హవాలా కేసులో చిక్కుకుని విచారణ ఎదుర్కొంటున్నట్లు వస్తున్న వార్తలతో ఆయన ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కు చెందిన నాలుగు సంస్థల నుంచి రూ.17 కోట్లు అక్రమంగా తరలించడంపై ఆదాయ పన్ను విభాగం ఆయనకు సమాన్లు పంపింది. అక్టోబరు 4న తమ ముందు హాజరుకావాలని పేర్కొంది. దీనిపై జైన్ ట్విట్టర్ లో స్పందించారు. ఆయా కంపెనీల్లో తాను పెట్టుబడులు మాత్రమే పెట్టానని, 2013 నుంచి వాటితో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కేవలం ప్రశ్నించడానికి మాత్రమే ఐటీ విభాగం పిలిచిందని, విచారించడానికి కాదని పేర్కొన్నారు. హవాల కేసులో విచారణ ఎదుర్కొంటున్న కోల్ కతాకు చెందిన జీవెంద్ర మిత్రా తన వాగ్మూలంలో జైన్ సంస్థల నుంచే ఇదంతా జరుగుతోందని తెలపడంతో ఐటీ విచారణ చేపడుతోంది. దీంతో, కేజ్రీవాల్ కేబినెట్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కోంటున్న మంత్రుల సంఖ్య 4కు చేరింది.
Samayam Telugu aap minster in it net
హవాలా కేసులో ఆప్ మంత్రి!


The IT department has issued summons to Delhi Health Minister Satyendra Jain. Officials said that Jain has been asked to appear before the Investigating Officer of the case on October 4th.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.