యాప్నగరం

కుమార్ ఝలక్‌కు.. దిగివచ్చిన కెజ్రీ!

అసలే వరుస ఓటములతో సతమతం అవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి అంతర్గత కలహాలు సైతం తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో...

TNN 3 May 2017, 4:02 pm
సలే వరుస ఓటములతో సతమతం అవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి అంతర్గత కలహాలు సైతం తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో తిరుగుబావుటా ఎగరేసిన కుమార్ విశ్వాస్‌తో ఆప్ ముఖ్య నేతలు బుధవారం సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలనే ఆయన డిమాండుకు పార్టీ ఒప్పుకుంది. ఈ సందర్భంగా కుమార్ విశ్వాస్‌పై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఆప్ నేత అమనుతుల్లాను పార్టీ ప్రధాన సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు.
Samayam Telugu aap mla amanatullah khan suspended from primary membership of the party
కుమార్ ఝలక్‌కు.. దిగివచ్చిన కెజ్రీ!


పార్టీ ముందు కుమార్ విశ్వాస్ ఉంచిన పలు డిమాండ్లకు కూడా పార్టీ తలొగ్గింది. పార్టీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న నేతలపై చర్యలు తీసుకుంటామని పీఏసీ హాపీ ఇచ్చింది. అలాగే, ‘వుయ్ ద నేషన్’ వీడియోలో చేసిన వ్యాఖ్యలు కూడా కుమార్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ సమావేశం తర్వాత కుమార్ విశ్వాస్, మంత్రి మనీష్ శిసోడీయాలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. పార్టీలో సమస్యలన్నీ పరిష్కారమైనట్లు వెల్లడించారు. దీనీతోపాటు కుమార్ విశ్వాస్‌కు రాజస్థాన్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.