యాప్నగరం

ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అసెంబ్లీలో డెమో!

ఓ వైపు ఆప్‌లో అంతర్యుద్ధం జరుగుతుండగా.. అసెంబ్లీ సమావేశాల్లో ఆ పార్టీ ఈవీఎంల అంశాన్ని తీసుకురావడం ఆసక్తికరంగా మారింది..

TNN 9 May 2017, 5:29 pm
ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ డిల్లీ అసెంబ్లీలో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై డెమో ఇచ్చింది. ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌లో పదేళ్ల అనుభవం ఉన్న ఆప్‌ ఎమ్మెల్యే సౌరభ్‌ భరద్వాజ్‌ సభలోకి ఈవీఎంను తీసుకొచ్చి, ఎలా ట్యాంపర్‌ చేస్తారో వివరించారు. ఎన్నికల ముందు ఈవీఎంలను ఎలా పరిశీలిస్తారు, ఓటు వేస్తే ఎలా రికార్డ్‌ అవుతుంది తదితర అంశాలన్నింటినీ ఈ ప్రత్యక్ష ప్రదర్శనలో ఆయన చూపెట్టారు. డిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో పాత తరం ఈవీఎంలను వాడారని, వాటిని సులువుగా ట్యాంపర్‌ చేయొచ్చని, అందుకే మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయని ఆయన ఆరోపించారు.
Samayam Telugu aap mla saurabh bharadwaj demonstrates how evms can be tampered
ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అసెంబ్లీలో డెమో!


ఓ వైపు ఆప్‌లో అంతర్యుద్ధం జరుగుతుండగా.. అసెంబ్లీ సమావేశాల్లో ఆ పార్టీ ఈవీఎంల అంశాన్ని తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు చేసిన ఆప్‌ బ‌హిష్కృత‌ నేత కపిల్‌ మిశ్రా.. విషయాన్ని పక్కదోవ పట్టించడానికే ఆ పార్టీ ఈ ఉదంతానికి తెర తీసిందని విమర్శించారు.
Secret code is punched in by a party's supporter who reaches a booth as a voter: AAP's @Saurabh_MLAgk demonstrates how #EVMs can be tampered pic.twitter.com/phETyJEjbj — Times of India (@timesofindia) May 9, 2017
కేజ్రీవాల్‌పై మిశ్రా ఇవాళ ఉదయం సీబీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మిశ్రా ఆరోపణలను కొట్టి పారేసిన ఆప్‌.. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో సంచలన ప్రకటన చేస్తామని వెల్లడించింది. అది కేజ్రీవాల్‌ రాజీనామా కాదని, అంతకంటే పెద్ద విషయమే ఉందని ఆసక్తి రేకేత్తించింది. తాజాగా ఆ సంచలన విషయం ఈవీఎంల గురించేనని పేర్కొనడంతో ఉత్కంఠకు తెరపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.