యాప్నగరం

ఆ ఎమ్మెల్యే భార్యను కొట్టి హింసించేవారు

ఆమ్ ఆద్మీపార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమనాథ్ భారతి తన భార్యను విఫరీతంగా కొట్టేవారని

TNN 12 May 2017, 7:27 pm
ఆమ్ ఆద్మీపార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమనాథ్ భారతి తన భార్యను విఫరీతంగా కొట్టేవారని, హింసించేవారని ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. గృహహింస కేసులో మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలని ఆయన భార్య లిపికా మిత్ర ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Samayam Telugu aap mla somnath bharti used to beat harass wife
ఆ ఎమ్మెల్యే భార్యను కొట్టి హింసించేవారు


ఈ కేసులో ట్రయల్ కోర్టు పలు అంశాలను పరిశీలించకుండానే సోమనాథ్ బెయిల్ మంజూరు చేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులను అపిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
‘పెళ్లయి కొద్ది రోజుల నుంచే సోమనాథ్ భారతి తన భార్య లిపికా మిత్రను వేధించడం, దాడి చేయడం ప్రారంభించాడు’ అని ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు తెలిపారు.

లిపికా శరీరంపై ఉన్న గాయాలు కుక్కగాటుతో ఏర్పడి ఉండవచ్చని ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన రిపోర్టును కోర్టు పరిశీలించింది.
ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో డయాబెటిస్, హైపర్ టెన్షన్ తో బాధపడిందని వైద్యుల రిపోర్టును కూడా పరిశీలనలోకి తీసుకుంది.

ఇదిలా ఉండగా 2015 అక్టోబర్ లో బెయిల్ పై విడుదలైన సోమనాథ్.. తనపై భార్య, పోలీసులు చేస్తున్న ఆరోపణలు ఖండించారు.

లిపికా ఫిర్యాదు మేరకు సోమనాథ్ పై గృహహింస, అత్యాయత్నం కేసు నమోదైంది. 2015 సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.