యాప్నగరం

Bilkis Bano case: ప్రధాని చెప్పే మాటలకు, చేసే పనులకు సంబంధం లేదు: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Bilkis Bano case) ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. బిల్కిస్‌బానో కేసులోని నిందితుల విడుదలపై ఆమె విమర్శలు గుప్పించారు. చెప్పే మాటలను.. చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని రాహుల్ గాంధీ ప్రధానిని ఉద్దేశించి విమర్శించారు. ఆ కేసులో నిందితులను విడుదల చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జాతికి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు. కాగా ఆ కేసులొ 11 మంది దోషులను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 17 Aug 2022, 5:04 pm

ప్రధానాంశాలు:

  • మోదీపై మండిపడ్డ రాహుల్ గాంధీ
  • బిల్కిస్‌బానో అనే మహిళపై గ్యాంగ్ రేప్
  • దోషులను జీవిత ఖైద విధించిన కోర్టు
  • 11 మంది దోషుల విడుదల చేసిన ప్రభుత్వం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rahul Gandhi
Bilkis Bano case: ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే మాటలకు, చేతలకు సంబంధం ఉండడం లేదని, ఆ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. బిల్కిస్ బానో రేప్ కేసులో దోషుల విడుదలను తప్పుబడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం మోదీ మాటలకు, చేతలకు మధ్య వ్యత్యాసాన్ని చూస్తోందని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
"ఐదు నెలల గర్భిణిపై అత్యాచారం చేసి, ఆమె మూడేళ్ల కుమార్తెను హత్య చేసిన వారిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా విడుదల చేశారు. స్త్రీశక్తి గురించి అబద్ధాలు చెప్పే వారు దేశంలోని మహిళలకు ఏమి సందేశం ఇస్తున్నారు..?" అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. గుజరాత్‌లో బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడిన మొత్తం 11 మంది దోషులను బీజేపీ ప్రభుత్వం విడుదల చేసిన రెండు రోజుల తర్వాత రాహుల్ గాంధీ ఈ విధంగా స్పందించారు.


2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్‌బానో అనే మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఐదు నెలల గర్భిణిని దాహోద్ జిల్లాలో అత్యాచారం చేశారు. ఆమె కుటుంబ సభ్యులను ఏడుగురిని హతమార్చారు. అయితే ఈ హృదయ విదారకరమైన ఘటనలో 2008 జనవరి 21న ముంబైలోని ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కోర్టు పదకొండు మందికి జీవిత ఖైదు విధించింది. ఆ శిక్షను బాంబే హైకోర్టు కూడా సమర్థించింది.

అయితే ఈ దోషులు 15 సంవత్సరాలకుపైగా జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత వారిలో ఒకరు తనను ముందస్తుగా విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని శిక్షను తగ్గించే అంశాన్ని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ తర్వాత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ప్యానల్‌కు నేతృత్వం వహించిన పంచమహల్స్ కలెక్టర్ సుజల్ మయాత్ర తెలిపారు. ఈ క్రమంలో ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఆ నిందితులకు గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. అయితే ఈ చర్యపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలను చూసే వైఖరిలో మార్పు రావాలని జాతికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ మహిళల భద్రత ప్రసంగాలకే పరిమితమా..? అనే కోణంలో ప్రశ్నించారు. అలాగే బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ కూడా విస్మయం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.