యాప్నగరం

బాబ్రీ కేసులో బీజేపీ అగ్రనేతలకు ఊరట

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ అగ్రనేతలు ఎల్.కె. అద్వానీ, మురళీ

Samayam Telugu 7 Jun 2017, 1:03 pm
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ అగ్రనేతలు ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతిలకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఊరట కలిగించింది. ఈ కేసు విచారణ సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి నేతలకు మినహాయింపునిచ్చింది.
Samayam Telugu advani mm joshi uma bharti exempted from appearance in court babri masjid case
బాబ్రీ కేసులో బీజేపీ అగ్రనేతలకు ఊరట


సీబీఐ ప్రత్యేక కోర్టు వీరికి గత నెల 30న బెయిల్‌ మంజూరు చేసింది. కేసు నమోదు చేయొద్దంటూ దాఖలైన డిశ్చార్జ్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. అద్వానీ సహా మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతిలపై కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది.

1992 డిసెంబర్ 6న అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. మసీదు ప్రాంతంలో రామమందిర ఉందని.. ఒక వర్గం.. కాదు కాదు.. ఇక్కడ మసీదే ఉందని మరో వర్గం వాదించుకుంటున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.