యాప్నగరం

‘సాంబా’ ఉగ్రవాది చేతిపై ఆప్ఘాన్ ఫోన్ నంబర్

జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో బీఎస్ఎఫ్ స్థావరంపై మంగళవారం ముగ్గరు ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

TNN 2 Dec 2016, 11:57 am
జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో బీఎస్ఎఫ్ స్థావరంపై మంగళవారం ముగ్గరు ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఎస్‌ఎఫ్ విచారణ కొనసాగుతోంది. సరిహద్దు సమీపంలో బుధవారం ఓ సొరంగాన్ని గుర్తించినట్టు ప్రకటించిన బీఎస్ఎఫ్, గురువారం మరొక ఆధారాన్ని కనిపెట్టింది. ఆర్మీ మట్టుబెట్టిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒక ముష్కరుడి చేతిపై ఆఫ్ఘానిస్తాన్‌కు చెందిన ఫోన్ నంబర్ ఉన్నట్టు గుర్తించింది.
Samayam Telugu afghan contact number found scribbled on samba terrorists arm
‘సాంబా’ ఉగ్రవాది చేతిపై ఆప్ఘాన్ ఫోన్ నంబర్


అయితే పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్న వీరి వద్ద ఆఫ్ఘాన్ నంబర్ ఉండటంపై బీఎస్ఎఫ్ విచారణ ప్రారంభించింది. ఒకవేళ భారత ఆర్మీని తప్పుదారి పట్టించేందుకే ఆఫ్ఘాన్ నంబర్‌ను చేతిపై రాసుకున్నాడా అనే కోణంలోనూ బీఎస్ఎఫ్ దర్యాప్తు చేస్తోంది. ఈ నంబర్‌ ఆఫ్ఘానిస్తాన్‌లో ఎవరి పేరున రిజిస్టర్ అయి ఉందో కనుక్కోడానికి ఆర్మీ ప్రయత్నిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.