యాప్నగరం

వెంట పడి మరీ... నైజీరియన్లను చితక్కొట్టారు

ఇంటర్ చదివే పిల్లాడు... డ్రగ్ ఓవర్ డోస్ తో మరణించాడు.

TNN 28 Mar 2017, 2:36 pm
ఇంటర్ చదివే పిల్లాడు... డ్రగ్స్ ఓవర్ డోస్ తో మరణించాడు. దానికి కారణం అయిదుగురు నైజీరియన్లే అని భావించారు స్థానికులు. పోలీసులు ఏం పట్టించుకోకపోవడంతో... కనిపించిన నైజీరియన్లను పరిగెట్టించి కొట్టారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. ఖరి అనే టీనేజర్ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. గ్రేటర్ నోయిడాలోని ఎన్ఎస్జీ సొసైటీలో నివసిస్తున్నాడు. గత శుక్రవారం సాయంత్రం ఆయన కనిపించకుండా పోయాడు. మరుసటి రోజు ఉదయం అపస్మారక స్థితిలో ఇళ్ల మధ్య కనిపించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. డ్రగ్స్ శాతం ఎక్కువైపోయి మరణించినట్టు చెప్పారు వైద్యులు.
Samayam Telugu africans beaten up in greater noida after drug death
వెంట పడి మరీ... నైజీరియన్లను చితక్కొట్టారు


సొసైటీలో నివసిస్తున్న స్థానికులకు ఆ ప్రాంతంలో ఉండే అయిదుగురు నైజీరియన్ల మీద అనుమానం వచ్చింది. వారే ఖరీకి డ్రగ్స్ అలవాటు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అయిదుగురు నైజీరియన్లను అరెస్టు చేసి ఆధారాలు లేవని చెప్పి వదిలేశారు. విషయం తెలిసి స్థానికులు ర్యాలీగా వచ్చారు. జిల్లా మెజిస్ట్రేట్ కు మెమరాండం సమర్పించి తిరిగి వెళుతున్నప్పుడు వారికి ముగ్గురు నైజీరియన్లు కనిపించారు. కోపంతో వారిని వెంటవెంటపడి కొట్టారు. చేతికి దొరికిన వస్తువులతో వారిని చితక్కొట్టారు. మరో చోట కారులో వెళుతున్న వారిని కూడా ఆపి కొట్టారు. వారంతా తీవ్రంగా గాయాలపాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్చారు పోలీసులు. ఈ ఘటనలో అయిదుగురిని అరెస్టు చేసినట్టు చెప్పారు పోలీసులు. కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ జరిగిన ఘటన పూర్వాపరాలపై తనకు నివేదిక ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.