యాప్నగరం

కాంగోలో భారతీయులపై దాడులు

ఢిల్లీ నగరంలో తమ జాతీయుడిని దారుణంగా హతమార్చిన ఘటనపై కాంగో దేశస్తులు రగిలిపోతున్నారు.

TNN 26 May 2016, 9:14 pm
ఢిల్లీ నగరంలో తమ జాతీయుడిని దారుణంగా హతమార్చిన ఘటనపై కాంగో దేశస్తులు రగిలిపోతున్నారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి తమ దేశంలో నివసిస్తున్న భారతీయులపై దాడులకు పాల్పడుతున్నారు. కాంగోలోని భారతీయుల సంఖ్య చెప్పుకోదగిన రీతిలోనే ఉంది. అక్కడ మనవాళ్లు సూపర్ బజార్లు, చిల్లర దుకాణాలు, చిన్నపాటి హోటళ్లను నిర్వహిస్తుంటారు. భారతీయుల జాత్యహంకారం గురించి స్థానికంగా వార్తలు ప్రచురితమవుతున్నాయి. భారతీయులపై జరుగుతున్న దాడులను భారత విదేశాంగ విభాగం ప్రతినిధి వికాస్ స్వరూప్ కూడా ధ్రువీకరించారు. మనదేశంలో చదువుకుంటున్న 23ఏళ్ల ఎం.కె. ఆలివర్ అనే కాంగో విద్యార్థిపై కొందరు ఆగంతకులు దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో దాడికి పాల్పడి రక్తం వచ్చేలా హింసించి చంపారు. హంతకులను కనుగొనడంలో ఇప్పటికీ పోలీసులు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో మన విదేశాంగశాఖ సత్వరమే స్పందించింది. ఆ దేశంలో భారతీయుల రక్షణకు చర్యలు ప్రారంభించింది. భారతదేశంలో కాంగో విద్యార్థులను కంటికిరెప్పలా కాపాడుకుంటామని, వారి విద్యాభ్యాసాన్ని నిరాటంకంగా కొనసాగించుకోవచ్చని ఇప్పటికే మన విదేశాంగ శాఖ కాంగో ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు స్వరూప్ చెప్పారు.
Samayam Telugu after congolese nationals murder in delhi indians face wrath in congo
కాంగోలో భారతీయులపై దాడులు


ఈ విషయమై కాంగో సహా ఇతర ఆఫ్రికా దేశాల్లో కూడా మనదేశం గురించి తప్పుడు సంకేతాలు వెళ్లే సూచనలు కనిపిస్తుండటంతో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ కూడా స్వయంగా రంగంలోకి దిగారు. ఈ ఘటనపై తన ఆవేదనను వ్యక్తం చేసారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగబోవని ట్విట్టరు ద్వారా హామీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.