యాప్నగరం

మీ చర్యలతో భారత దౌత్య సిబ్బందికి ముప్పు పొంచి ఉంది: పాక్‌కు భారత్ హెచ్చరిక

రెండు వారాల కిందట దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్న ఇద్దరు పాకిస్థాన్ దౌత్య ఉద్యోగులను ఢిల్లీ పోలీసులు, నిఘా వర్గాలు కాపుకాసి పట్టుకున్న విషయం తెలిసిందే.

Samayam Telugu 15 Jun 2020, 11:40 am
గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు దౌత్య సిబ్బందిని భారత్ బహిష్కరించిన విషయం తెలిసిందే. తమ దౌత్య సిబ్బందిని బహిష్కరించారనే అక్కసుతో పాక్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలోని అధికారులకు దాయాది ఇబ్బందులు కలిగిస్తోంది. ప్రతీకార చర్యలకు పాకిస్థాన్ ప్రయత్నించడంతో భారత్ దౌత్య సిబ్బంది సాధారణ కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. భారత అధికారులను వెంబడించడం.. వారి ఇంటి వద్ద నిఘా ఉంచడం లాంటి కార్యకలాపాలకు పాక్ పాల్పడుతోంది.
Samayam Telugu భారత్-పాకిస్థాన్ సంబంధాలు
India Pakistan Relations


ఈ నేపథ్యంలో పాక్ చర్యలను వ్యతిరేకిస్తూ శుక్రవారం మరోసారి భారత్ నిరసన తెలియజేసింది. పాక్ చర్యలు ఇరు దేశాల మధ్య కుదిరిన 1961 నాటి వియన్నా ఒప్పందం, దౌత్య సంబంధాలు, 1992 నాటి ద్వైపాక్షిక ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని మండిపడింది. వియన్నా ఒప్పందానికి కట్టుబడి ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్, సిబ్బందికి భద్రత కల్పించి, సాధారణ కార్యకలాపాల నిర్వహణకు సహకరించాలని కోరింది.

ఖచ్చితంగా చెప్పాలంటే, కోవిడ్ -19 ముప్పుతో ఇప్పటికే కార్యకలాపాలు తగ్గిపోయాయని పేర్కొంది. ఏదేమైనా, గూఢచర్యానికి పాల్పడుతున్న పాక్ అధికారులను పట్టుకున్న మే 31 నుంచి భారత అధికారుల పట్ల బెదిరింపులకు పాల్పడుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇస్లామాబాద్‌లో భారత దౌత్య అధికారి గౌరవ్ అహ్లూవాలియా ఇటీవల బెదిరింపులకు గురయ్యారు.

దౌత్య ఒప్పందాలను ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్దంగా గూఢచర్యానికి పాల్పడుతున్న భారత్‌లోని పాక్ ఉద్యోగులను బహిష్కరించడంతో దాయాది ప్రతీకారంతో రగలిపోతోంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు పాకిస్థాన్ ఇలాంటి విధానం అవలంభించింది. గూఢచర్యం ఆరోపణలతో పాక్ అధికారిని 2016 లో భారత్ చివరిసారిగా బహిష్కరించగా.. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత ఇస్లామాబాద్‌లోని ఒక భారతీయ అధికారిని పాక్ బహిష్కరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.