యాప్నగరం

కాంగ్రెస్ పార్టీకి మిగిలిన‌వి.. ఈ రాష్ట్రాలే!

దేశంలో ఇప్పుడు బీజేపీ హ‌వా న‌డుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌లుగా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు క‌మ‌లం విర‌బూసింది. తాజాగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ను సైతం బీజేపీ త‌మ ఖాతాలో వేసుకుంది.

Suresh Chelluboyina | TNN 18 Dec 2017, 1:56 pm
దేశంలో ఇప్పుడు బీజేపీ హ‌వా న‌డుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌లుగా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు క‌మ‌లం విర‌బూసింది. తాజాగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ను సైతం బీజేపీ త‌మ ఖాతాలో వేసుకుంది. దేశంలో గ‌ల‌ 31 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మిగిలింది.. కేవ‌లం 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం మాత్ర‌మే. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో కూడా పంజాబ్ త‌రహా ఫ‌లితాలు ఆశించిన కాంగ్రెస్ పార్టీకి తాజా ఫ‌లితాల్లో ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. త‌మ చేతిలో ఉన్న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ను కూడా జార‌విడుచుకోవ‌డంతో ఉత్త‌రాదిలో కాంగ్రెస్ దాదాపు క‌నుమ‌రుగయ్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.
Samayam Telugu after gujarat himachal assembly elections 2017 how many states are bjp and congress ruling
కాంగ్రెస్ పార్టీకి మిగిలిన‌వి.. ఈ రాష్ట్రాలే!


దేశాన్ని కాంగ్రెస్ ర‌హితంగా మార్చే ల‌క్ష్యంతో ఉన్న బీజేపీ త‌ర్వాతి ల‌క్ష్యం క‌ర్ణాట‌క‌. ఇక్క‌డ పూర్వ వైభ‌వం తెచ్చుకోడాని బీజేపీ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తోంది. దీంతో, కాంగ్రెస్ పార్టీలో మ‌రింత ఆందోళ‌న నెల‌కొంది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ చేతిలో క‌ర్ణాట‌క‌తోపాటు పంజాబ్, మిజోరం, మేఘాల‌య, పుదుచ్చెరి మాత్ర‌మే ఉన్నాయి.

ప్రాంతీయ, లెఫ్ట్ పార్టీలు బ‌లంగా ఉన్న కేర‌ళా, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఢిల్లీ, త్రిపుర‌, తెలంగాణ రాష్ట్రాల్లో మిన‌హా మిగతా రాష్ట్రాలన్నీ బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి. మ‌రికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల‌తో పొత్తు పెట్టుకుని త‌మ ఉనికి చాటుతోంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకోన‌ట్ల‌యితే రానున్న రోజుల్లో దేశ‌మంతా కాషాయ‌మ‌యమైనా ఆశ్చ‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.