యాప్నగరం

మాయావతి బాటలోనే అఖిలేష్ యాదవ్

బీజేపీని ఎదుర్కొనేందుకు ఎవరితోనైనా చేతులు కలిపేందుకు తాను సిద్ధమేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి వెల్లడించిన మరుసటి రోజే..

Samayam Telugu 15 Apr 2017, 6:13 pm
బీజేపీని ఎదుర్కొనేందుకు ఎవరితోనైనా చేతులు కలిపేందుకు తాను సిద్ధమేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి వెల్లడించిన మరుసటి రోజే.. ఎస్పీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా మహాకూటమికి సై అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ఆయన శనివారం మీడియాతో అన్నారు.
Samayam Telugu after mayawati akhilesh hints for grand alliance
మాయావతి బాటలోనే అఖిలేష్ యాదవ్


మహాకూటమి ఏర్పాటులో ఎస్పీ తనవంతుగా కీలకపాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు.

ఈవీఎంల తప్పుడు లెక్కల వల్లే తాము మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పిన అఖిలేష్..బ్యాలెట్ పత్రాల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. బ్యాలెట్ పత్రాలపై తమకు నూటికి నూరుశాతం నమ్మకం ఉందని వెల్లడించారు.

తాము ప్రవేశపెట్టిన పథకాలనే సీఎం యోగి ఆదిత్యనాథ్ కొనసాగిస్తున్నారని అఖిలేష్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.