యాప్నగరం

తూచ్... చైనా రాయబారితో రాహుల్ భేటీ నిజమే!

భారత్ లో చైనా రాయబారితో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారనే విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

TNN 10 Jul 2017, 6:37 pm
భారత్ లో చైనా రాయబారితో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ అయ్యారనే విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇవన్నీ అవాస్తవాలేనని, చైనా రాయబారితో రాహుల్ భేటీ కాలేదని బుకాయించిన విషయం తెలిసిందే. ఇంతలోనే కాంగ్రెస్ మాట మార్చింది. చైనా రాయబారితో రాహుల్ సమావేశం కావడం నిజమేనని తెలిపింది. చైనా రాయబారి లూ జూహోయ్ తోపాటు భూటాన్ రాయబారి, జాతీయ మాజీ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ తో భేటీ అయ్యారని పేర్కొంది. వివిధ దేశాలకు చెందిన రాయబారులు, ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను తరచూ కలవడం సాధారణ విషమేనని పేర్కోవడం గమనార్హం. జులై 8 న చైనా రాయబారితో భేటీలో రాహుల్ పాల్గొన్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా తెలియజేశారు.
Samayam Telugu after morning of denials congress accepts rahul gandhi met chinese envoy
తూచ్... చైనా రాయబారితో రాహుల్ భేటీ నిజమే!


సిక్కిమ్ ప్రాంతంలో చైనాతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ రాహుల్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాహుల్‌తో తమ రాయబారి భేటీ అయినట్లు చైనా దౌత్యకార్యాలయం ప్రకటిస్తే, ఆ వార్తల్లో నిజం లేదని కాంగ్రెస్ ఈ ఉదయం కొట్టిపారేసింది. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. దోక్లామ్ ప్రాంతంలో ఉద్రిక్తతలపై ప్రధానికి ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాహుల్ గాంధీ గత శుక్రవారం ప్రశ్నించిన విషయం తెలిసిందే. భూటాన్ భూభాగంలో చైనా అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టడంతో భారత్ సైన్యం దీన్ని అడ్డుకుంది. అప్పటి నుంచి చైనా, భారత్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.