యాప్నగరం

నితిన్ పటేల్‌కు అమిత్ షా బుజ్జగింపులు!

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఆరోసారి అధికారం హస్తగతం చేసుకున్న భారతీయ జనతా పార్టీ, ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీకి రెండోసారి బాధ్యతలు కట్టబెట్టింది.

TNN 31 Dec 2017, 12:46 pm
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఆరోసారి అధికారం హస్తగతం చేసుకున్న భారతీయ జనతా పార్టీ, ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీకి రెండోసారి బాధ్యతలు కట్టబెట్టింది. ఉప-ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్‌ కూడా ప్రమాణం చేశారు. అయితే తనకు కేటాయించిన శాఖలపై ఆయన అసంతృప్తితో ఉన్నారని, అందుకే బాధ్యతలు స్వీకరించలేదనే వార్తలు వెలువడ్డాయి. ప్రభుత్వం కొలువుదీరి ఐదురోజులైనా కాలేదు అసమ్మతి సెగ తగలడంతో అధిష్ఠానం రంగంలోకి దిగింది. దీంతో అలకవీడిన నితిన్ పటేల్ బాధ్యతలు చేపట్టేందుకు సముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. సచివాలయానికి ఆదివారం వెళ్లి బాధ్యతలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. తనకు ప్రాధాన్యత ఉన్న శాఖలను కేటాయిస్తామని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి హామీ లభించిన తర్వాత నితిన్ పటేల్ ఈ ప్రకటన చేశారు.
Samayam Telugu after phone call with amit shah nitin patel ready to take charge of ministries
నితిన్ పటేల్‌కు అమిత్ షా బుజ్జగింపులు!


గతంలో కీలకమైన ఆర్థిక, పట్టణాభివృద్ధి శాఖలను నిర్వహించిన నితిన్ పటేల్‌కు ఈ సారి అప్రాధాన్యత శాఖలు కేటాయించడం పట్ల గుర్రుగా ఉన్నారు. రోడ్లు, భవనాలు, ఆరోగ్యం, వైద్య విద్య, నర్మద, కల్పసార ప్రాజెక్టు లాంటి శాఖలను అప్పగించారు. గతంలో తాను నిర్వహించే శాఖలనే తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తనకు జూనియర్‌ అయిన సౌరభ్ పటేల్‌కు రెండు కీలక శాఖలను అప్పగించడం కూడా నితిన్‌‌కు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యింది.

మరోవైపు పాటేదార్ అనామత్ ఆందోళన సమితి నేత హార్దిక్ పటేల్ ఒకడుగు ముందుకేసి బీజేపీలో గౌరవం దక్కకపోతే పది మంది ఎమ్మెల్యేలతో బయటకి వచ్చేయ్... కాంగ్రెస్ పార్టీతో మాట్లాడతా. నీకు సముచిత ప్రాధాన్యం దక్కేలా చేస్తా’నని నితిన్‌ పటేల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. బీజేపీకి వందలోపు సీట్లు మాత్రమే దక్కడం.. కాంగ్రెస్ కూడా బలమైన ప్రత్యర్థిగా ఉండటంతో హార్దిక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.