యాప్నగరం

చైనా లక్ష్యంగా.. టీ90 యుద్ధ ట్యాంకులకు మెరుగులు

చైనాను దీటుగా ఎదుర్కోవడం కోసం భారత సైన్యం అప్రమత్తమైంది. తన అమ్ముల పొదిలోని అస్త్రాలకు మెరుగులు దిద్దుతోంది.

TNN 20 Aug 2017, 7:23 pm
చైనాతో డోక్లాం వివాదం నేపథ్యంలో భారత ఆర్మీ అప్రమత్తమైంది. మనకంటే అధునాతన ఆయుధ సంపత్తి ఉన్న డ్రాగన్‌కు దీటుగా తన అమ్ముల పొదిలోని ఆయుధాల్ని మెరుగు పర్చుకుంటోంది. అందులో భాగంగానే రష్యా రూపొందించి అందించిన టీ90 యుద్ధ ట్యాంకులను భారత సైన్యం ఆధునికీకరిస్తోంది. మూడో తరం క్షిపణి వ్యవస్థతో వీటికి మెరుగులు దిద్దుతోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా.. 8 కి.మీ. దూరంలోని లక్ష్యాలను తాకేలా ఈ యుద్ధ ట్యాంకులను ఆర్మీ తీర్చిదిద్దుతోంది. శత్రువుపై దాడి చేసే సామర్థ్యాన్ని మరింతగా పెంచుకుంటోంది.
Samayam Telugu after this upgrade indias main battle tank will become more lethal
చైనా లక్ష్యంగా.. టీ90 యుద్ధ ట్యాంకులకు మెరుగులు


ప్రస్తుతం టీ90 యుద్ధ ట్యాంకులకు లేజర్ గైడెడ్ ఇన్‌వార్ మిసైల్ సిస్టమ్‌తో రూపకల్పన చేశారు. వీటిని ఆధునికీకరించడం వల్ల మారుమూల ప్రాంతాల్లోనూ వ్యూహాత్మక లక్ష్యాలను చేధించడం సులభతరం అవుతుంది. ఎత్తయిన యుద్ధ క్షేత్రాల్లోనూ దాడి సామర్థ్యాన్ని పెంచేలా.. టీ90 యుద్ధ ట్యాంకుల్లో మాడ్యులార్ ఇంజిన్లను ఏర్పాటు చేసేందుకు ఆర్మీ విడిగా ఓ ప్రాజెక్టును ప్రారంభించింది.



డోక్లాం ఉద్రిక్తతల నేపథ్యంలో స్వల్పకాలిక యుద్ధం వస్తే.. దాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ప్రభుత్వం గత నెల ఆర్మీకి సూచించింది. అందుకు అనుగుణంగా ఆయుధ సామాగ్రిని సమకూర్చుకోవడం కోసం ఆర్మీ వైస్ చీఫ్‌కు అధికారాలు కట్టబెట్టింది. బోయింగ్ సంస్థ నుంచి భారత సైన్యం ఆరు అపాచీ హెలికాప్టర్లు కొనుగోలు చేయడం కోసం రక్షణ శాఖ గురువారం అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.