యాప్నగరం

Agra: శ్వాస తీసుకోలేకపోయిన శిశువు.. తన నోటితో ప్రాణం పోసిన డాక్టరమ్మ

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో (Agra) అరుదైన సంఘటన చోటుచేసుకుంది. గత మార్చిలో స్థానిక ఆస్పత్రిలో ఓ మహిళకు సాధారణ డెలివరీ జరిగింది. అయితే పుట్టిన బిడ్డకు శ్వాస అందక.. చలనం కోల్పోయింది. దాంతో ఆస్పత్రిలో మహిళా డాక్టర్.. తన నోటితో ఆ పాపాయికి శ్వాస అందించింది. ఏడు నిమిషాల పాటు శ్వాస అందించడంతో.. పాప వెంటనే లేచింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ డాక్టర్‌కు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 24 Sep 2022, 9:12 pm

ప్రధానాంశాలు:

  • ఉత్తరప్రదేశ్‌లో అరుదైన సంఘటన
  • నవజాత శిశువుకు నోటితో సీపీఆర్
  • శ్వాస ఇచ్చి బిడ్డను కాపాడిన డాక్టరమ్మ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Woman Doctor Saves Newborn
Agra: చావు బతుకుల్లో ఉన్నవారిని డాక్టర్లు కాపాడతారు. అందుకే వారిని దేవుళ్లతో పోలుస్తారు. మందులు, ఆపరేషన్‌లు చేసి ఎలాగైనా రక్షిస్తారు. కానీ ఓ డాక్టరమ్మ.. తన నోటితో ఓ శిశువు ప్రాణాలను కాపాడింది. ఈ అరుదైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన మార్చిలోనే జరిగింది.. తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఒక మహిళ ఓ పసి పాపకు జన్మనిచ్చింది. అయితే అలా పుట్టిన శిశువు శ్వాస తీసుకోలేకపోయింది. ఆక్సిజన్ అందించినా ఫలితం లేకపోయింది. శరీరంలో కదలిక కూడా లేదు.
ఆస్పత్రిలో ఉన్న డాక్టర్ సులేఖా చౌదరి విషయం అర్థమైంది. వెంటనే ఆ పాపకు కార్డియో పల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్‌) చేశారు. అంటే నోటి ద్వారా ఆ పాపకు శ్వాస అందించారు. దాదాపు ఏడు నిమిషాల పాటు అలా చేశారు. దాంతో ఆ పసి పాపలో కదలిక వచ్చింది. ఉన్నపళంగా ఏడ్చింది. తన ప్రయత్నం ఫలించినందుకు ఆ డాక్టర్‌ సంతోషించింది. దీనికి సంబంధించిన వీడియోని యూపీ పోలీస్‌ అధికారి సచిన్ కౌశిక్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. గత మార్చిలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసు అధికారి మరోసారి ఈ వీడియో షేర్ చేయడంతో.. ఆ డాక్టరమ్మ చేసిన పని మరోసారి హాట్‌టాపిక్ అయింది.


ఆ వీడియోలో డాక్టర్ సులేఖ చౌదరి శిశువు ఊపిరి పీల్చుకోవడానికి తన వంతు ప్రయత్నం చేయడం, ఆమె వీపును తట్టడం చూడవచ్చు. శిశువు ఏడ్చిన తర్వాత డాక్టర్ ఆమె చేతుల్లో ఉన్న శిశువును ఆనందంగా ఊపుతూ కనిపించారు. ఈ వీడియోని చాలామంది వీక్షిస్తున్నారు. ఇప్పటికే 1.3 మిలియన్లకు పైగా చూశారు. దీనికి చాలా లైక్‌లు వచ్చాయి. శిశువును రక్షించడానికి తన శాయశక్తులా కృషి చేసినందుకు నెటిజన్లు డాక్టర్‌ను అభినందిస్తున్నారు. వృత్తి పట్ల ఆమె అంకిత భావాన్ని చూసి సెల్యూట్ చేస్తున్నారు.

Read Also:దెబ్బలు తగలకుండా... హెల్మెట్‌లు పెట్టుకుని బస్సులు నడుపుతున్న డ్రైవర్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.