యాప్నగరం

ప్రధాని చెప్పారనే పళనితో చేతులు కలిపా, కానీ!

పార్టీని బతికించుకోవడం కోసం ఇరు వర్గాలు కలిసి పోవాలని ప్రధాని చెప్పడంతోనే పళనిస్వామి వర్గంలో కలిశాను.

TNN 17 Feb 2018, 4:36 pm
జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయం ఎన్ని మలుపులు తిరిగిందో అందరికీ తెలిసిందే. జయలలిత స్థానంలో శశికళ సీఎం పదవిని చేపట్టడానికి యత్నించింది. కానీ అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి జైలుకెళ్లింది. జైలుకు వెళ్లే ముందు ఆమె ఎడప్పాడి పళనిస్వామిని సీఎం చేసింది. కానీ అప్పటికే అన్నాడీఎంకే రెండు వర్గాలు చీలింది. శశికళ వర్సెస్ పన్నీర్ పోరు కాస్తా.. ఈపీఎస్ వర్సెస్ ఓపీఎస్‌గా మారింది. ఈ పరిస్థితుల్లోనే ప్రధాని మోదీ జోక్యం చేసుకొని ఇరు వర్గాలను కలిపారు. ఈ విషయాలు అందరికీ తెలిసివే. ఓపీఎస్ శనివారం మరో ఆసక్తికర విషయం బయటపెట్టారు.
Samayam Telugu agreed for aiadmk merger on pm modis insistence o panneerselvam
ప్రధాని చెప్పారనే పళనితో చేతులు కలిపా, కానీ!


‘పార్టీని బతికించాలంటే ఇరు వర్గాలను వీలినం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దీంతో ఈపీఎస్‌ వర్గంతో కలవడానికి అంగీకరించాను. కానీ మంత్రి పదవి తీసుకోనని, పార్టీ పదవి మాత్రమే చేపడతానని చెప్పాను. లేదు లేదు.. నువ్వు తప్పకుండా మంత్రిగా ఉండాల్సిందే. రాజకీయాల్లో కొనసాగాల్సిందే అని ప్రధాని చెప్పారు’ అని ఓపీఎస్ శనివారం తెలిపారు.

థేనిలో అన్నాడీఎంకే పార్టీ సమావేశం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ విషయాలు బయటపెట్టారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది. నేను ఎదుర్కొన్న విమర్శలు, సమస్యలు మరెవరైనా ఎదుర్కొని ఉంటే.. ఆత్మహత్య చేసుకునే వారు. కానీ అమ్మ కోసం మౌనంగా విమర్శల్ని భరించానని పన్నీర్ సెల్వం చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.