యాప్నగరం

శశికళ వర్గంలో ముసలం...ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు?

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శశికళ వర్గంలోని శాసనసభ్యులు ఎదురుతిరిగినట్లు సమాచారం.

TNN 17 Feb 2017, 12:58 pm
తమిళ రాజకీయాల్లో ఈ రోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బల పరీక్షకు ముందు శశికళ వర్గానికి చెందిన సుమారు 40 మంది ఎమ్మెల్యేలు ఎదురుతిరిగినట్లు సమాచారం. దీంతో తమిళనాడు సీఎం పళనిసామికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఎదురుతిరిగిన శాసనసభ్యులతో రాజీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు వారిని బయపెట్టి లొంగదీసుకోవాలని భావిస్తున్నారు.
Samayam Telugu aiadmk crisis some mlas of sasikala group oppose palanisamy
శశికళ వర్గంలో ముసలం...ఎదురుతిరిగిన ఎమ్మెల్యేలు?


స్పీకర్ కూడా తమ వర్గంలోనే ఉన్నారని, ఎదురుతిరిగితే అనర్హత వేటు వేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. మరో పక్క పన్నీర్‌ సెల్వం వర్గం కూడా దూకుడు పెంచింది. శశికళ, దినకరన్, వెంకటేశ్‌లను అన్నాడీఎంకే నుంచి తొలగిస్తూ మధుసూదనన్ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పళనిసామి రేపు అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు.

ఆయన గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో తనకు 124 మంది శాసనసభ్యులు మద్దతు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. తమిళనాట ఏం జరుగుతుందా అని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 1987 నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయా? లేక అశ్చితికి తెరపడుతుందా? అని చర్చించుకుంటున్నారు. గత పన్నెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో దేశం యావత్తు తమిళనాడు వైపు చూస్తోంది. అమ్మకు విధేయుడు పన్నీర్ సెల్వంకు ప్రజా మద్దతు పుష్కలంగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.