యాప్నగరం

విలేకర్లపై ‘వీధి’ వ్యాఖ్యలు.. ఏఐఏడీఎంకే నేతకు షాక్!

జర్నలిస్టులపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసిన ఏఐఏడీఎంకే నేత హరి ప్రభాకరన్ తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఆయణ్ని అన్ని రకాల పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేస్తూ సోమవారం (మే 28) నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 29 May 2018, 12:22 pm
జర్నలిస్టులపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసిన ఏఐఏడీఎంకే నేత హరి ప్రభాకరన్ తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఆయణ్ని అన్ని రకాల పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేస్తూ సోమవారం (మే 28) నిర్ణయం తీసుకున్నారు. తూత్తుకుడి స్టెరిలైట్ కాపర్ కర్మాగారానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో హింస చెలరేగి పోలీసు కాల్పుల కారణంగా 13 మంది మృతి చెందడమే కాకుండా అనేక మంది క్షతగాత్రులైన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాలను తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం పరామర్శించడానికి వెళ్లారు. పన్నీర్‌సెల్వం పర్యటన సందర్భంగా జర్నలిస్టులను ఆస్పత్రిలోకి అనుమతించలేదు. దీనిపై ఆయా వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసన ఎదురైన నేపథ్యంలో ప్రభాకరన్ స్పందించారు.

‘బిస్కెట్ల కోసం మొరిగే వీధి కుక్కలను లోపలికి అనుమతించకుండా గేటుకు కట్టేయాలి’ అంటూ జర్నలిస్టులను ఉద్దేశించి ప్రభాకరన్‌ వివాదాస్పద ట్వీట్‌ చేశారు. ప్రభాకరన్ ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. దీంతో ఏఐఏడీఎంకే దిగొచ్చింది. పార్టీ ఐటీ విభాగం కార్యదర్శిగా ఉన్న హరి ప్రభాకరన్‌పై వెంటనే సస్పెన్షన్ వేటు వేశారు.

ట్వీట్‌లో తాను వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ వ్యక్తిగతమైనవని, పార్టీకి సంబంధంలేదని, పార్టీ అభిప్రాయాలు వెల్లడించే అధికారం తనకు లేదని ప్రభాకరన్ మరో ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు. తన ట్వీట్‌తో ఎవరి మనోభావాలు గాయపడినా క్షమించాలని కోరారు. కానీ, అప్పటికే ఆయనకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.