యాప్నగరం

మళ్లీ చిన్నమ్మ బాట పట్టిన పళని వర్గం?

బెంగళూరులో జైల్లో ఉంటున్న శశికళ దర్శనం చాలా రోజులుగా ఎవరికీ దక్కలేదు.

TNN 22 May 2017, 9:13 am
బెంగళూరులో జైల్లో ఉంటున్న శశికళ దర్శనం చాలా రోజులుగా ఎవరికీ దక్కలేదు. ఆమె పార్టీ నాయకులను ఎవరినీ కలిసేందుకు సుముఖత చూపలేదు. టీవీల్లో పన్నీరు-పళని వర్గాల మధ్య జరుగుతున్న చర్చల గురించి కూడా పేపర్లు, టీవీల ద్వారా ఆమె తెలుసుకున్నారు. కానీ దానిపై పెదవి విప్పలేదు. చాలా రోజుల తరువాత ఆమెను ఓ మంత్రి, అయిదుగురు ఎమ్మెల్యేలు కలిసి వచ్చారు. దీంతో శశికళను కలిసేందుకు ఇతర మంత్రులు, నాయకులు కూడా సిద్ధమవుతున్నారు. ఆమెను కలిసిన వారిలో తమిళ మంత్రి బాలకృష్ణా రెడ్డి, ఎమ్మెల్యేలు కరుణాస్, తంగ తమిళ్ సెల్వన్, వెట్రివేల్, బీవీ రమణ ఉన్నారు. చిన్నమ్మతో వీరు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై, అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలపైనా వివరించినట్టు తెలుస్తోంది. శశికళ వ్యూహాత్మకంగానే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నట్టు సమాచారం. పళని, పన్నీరు వర్గాల మధ్య సమోధ్య కుదురుతుందో లేదో చూసిన ఆమె... వారిద్దరి మధ్య పొత్తు కుదరకపోవడంతో కాస్త ఊరట చెందినట్టు తెలుస్తోంది. త్వరలో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి జైలు నుంచి లేఖ రాసే అవకాశం ఉంది.
Samayam Telugu aiadmk leaders meets sasikala in jail
మళ్లీ చిన్నమ్మ బాట పట్టిన పళని వర్గం?


చిన్నమ్మను కలిసేందుకు పళని వర్గీయులు ఉవ్విళ్లూరుతుండడం చూసి పన్నీరు వర్గం విమర్శలు గుప్పిస్తోంది. శశికళను, దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించినట్టు పొత్తు చర్చల సమయంలో పళని వర్గం ప్రకటించడాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అప్పుడు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి... ఇప్పుడు మళ్లీ భేటీలు అవుతుండడంపై ఏం వివరణలు ఇస్తారని ప్రశ్నించారు. పళని వర్గం ఇంకెన్ని నాటకాలు ఆడుతుందో చూడాలని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.