యాప్నగరం

క్యాంపు ఎమ్మెల్యేల జాడపై హైకోర్టు ఆరా!

శశికళ క్యాంపు రాజకీయాలపై మద్రాస్ హైకోర్టు స్పందించింది. వివిధ హోటళ్లు, రిసార్టుల్లో ఎమ్మెల్యేలను శశికళ నిర్భందించారని

Samayam Telugu 10 Feb 2017, 12:17 pm
శశికళ క్యాంపు రాజకీయాలపై మద్రాస్ హైకోర్టు స్పందించింది. వివిధ హోటళ్లు, రిసార్టుల్లో ఎమ్మెల్యేలను శశికళ నిర్భందించారని అపద్ధర్మ సీఎం ఓ పన్నీర్ సెల్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ‘శిబిరం’లో ఉన్న ఎమ్మెల్యేలపై జాడపై నివేదిక సమర్పించాలని తమిళనాడు పోలీస్ శాఖను ఆదేశించింది.
Samayam Telugu aiadmk mlas camped in resorts madras hc seeks report from police
క్యాంపు ఎమ్మెల్యేల జాడపై హైకోర్టు ఆరా!


దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు మహాబలిపురం సమీపంలోని కువతూర్, 30 మంది ఎమ్మెల్యేలు కల్పక్కమ్ లోని పుంతందళమ్ లోని రిసార్టుల్లో సేద తీరుతున్న సంగతి తెలిసిందే. ఈ శిబిరాల్లో ఉన్న ఎమ్మెల్యేలు తన నుంచి క్యాంపు దాటి పోకుండా చిన్నమ్మ పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఫోన్లు, ఇంటర్నెట్, టీవీ, దినపత్రికలు కూడా ఎమ్మెల్యేలకు అందుబాటులో లేకుండా చేయడంతోపాటు క్యాంపు సమీపంలోని 2 కిలోమీటర్ల మేర తన టీంను కాపలా ఉంచింది.

ఓపీఎస్ మద్దుదారు, ఎమ్మెల్యే వీసీ అరుణ్ కుట్టీ మాట్లాడుతూ శశికళ ‘నిర్భందం’లో ఉన్న ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లు వాళ్ల నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.