యాప్నగరం

అవిశ్వాస తీర్మానం.. తమిళ పార్టీ నో!

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మోడీ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు ఉండదని ప్రకటించింది అన్నాడీఎంకే.

Samayam Telugu 19 Jul 2018, 2:49 pm
Samayam Telugu loksabha
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మోడీ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు ఉండదని ప్రకటించింది అన్నాడీఎంకే. అవిశ్వాస తీర్మానం ఓటింగులో తాము పాల్గొనమని ఆ పార్టీ స్పష్టం చేసింది. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు లోక్‌సభలో కూడా సంఖ్యపరంగా గట్టి బలమే ఉంది. ఈ పార్టీకి 37 మంది లోక్‌సభ ఎంపీలున్నారు.

అన్నాడీఎంకే ఎన్డీయేలో భాగస్వామిగా లేదు. అటు యూపీఏలోనూ లేదు. తటస్థ పార్టీగా ఉంది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో, ఓటింగులో పాల్గొనేది లేదని ఇప్పుడు ఈ పార్టీ స్పష్టం చేసింది. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందనే అభిప్రాయాలను కలిగిస్తోంది.

ఇది వరకూ ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసును ఇచ్చినప్పుడు కూడా అన్నాడీఎంకే లోక్‌సభలో రచ్చ రేపింది. కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ సభా కార్యక్రమాలకు అడ్డు తగిలింది. దీంతో అప్పుడు అవిశ్వాస తీర్మానమే చర్చకు రాలేదు.

తాము కావేరీ బోర్డు ఏర్పాటు విషయంలో ఆందోళన తెలుపుతున్నప్పుడు తమకు ఏ పార్టీ సహకారం అందించలేదని, అందుకే ఇప్పుడు తాము అవిశ్వాస తీర్మానంపై చర్చలో కానీ, ఓటింగులో కానీ పాల్గొనకూడదని నిర్ణయించినట్టుగా అన్నాడీఎంకే నేతలు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.