యాప్నగరం

Abhedya: కొవిడ్ యోధులకు వైరస్ సోకకుండా రక్షణ కవచం.. ఎయిమ్స్ ఆవిష్కరణ

AIIMS: కొవిడ్ యోధులను వైరస్ ఇన్‌ఫెక్షన్ నుంచి కాపాడటానికి ఎయిమ్స్, జోధ్‌పూర్ సరికొత్త రక్షణ కవచాన్ని రూపొందించింది. దీనికి అభేద్యా అని నామకరణం చేసింది.

Samayam Telugu 8 Jul 2020, 4:58 pm
రోనా మహమ్మారితో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ముందు వరసలో నిల్చొని పోరాడుతున్నారు. ఈ క్రమంలో వారు కూడా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిమ్స్, జోధ్‌పూర్ సరికొత్త రక్షణ కవచాన్ని రూపొందించింది. రిస్క్ కండిషన్లలో పనిచేస్తున్న కొవిడ్ యోధులు ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు ఈ రక్షణ కవచం ఉపకరిస్తుందని ఎయిమ్స్ వైద్య నిపుణులు తెలిపారు.
Samayam Telugu అభేద్యా ఎయిరోషీల్డ్
Abhedya Aroshield for Covid Warriors


ఇస్కాన్ సర్జికల్స్ లిమిటెడ్‌తో కలిసి ఎయిమ్స్ జోధ్‌పూర్ ఈ కొత్త రక్షణ కవచాన్ని తయారు చేసింది. ఒక పెట్టె మాదిరిగా ఉండే రక్షణ కవచానికి ‘అభే‌ద్యా’ అని పేరు పెట్టారు. ఈ పరికరాన్ని మంగళవారం (జులై 7) ఆవిష్కరించారు.

కరోనా రోగులకు అనస్థీషియా ఇచ్చేటప్పుడు, లేదా వారి నుంచి నమూనాలు, ఇతర స్రవాలను బయటకు తీసేటప్పుడు డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఎయిమ్స్, జోధ్‌పూర్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ మిశ్రా తెలిపారు. పెట్టె మాదిరిగా ఉండే దీనిలో పలు పరికరాలు ఉంటాయని వెల్లడించారు. చికిత్స సమయంలో పేషెంట్లను ఆ పెట్టెలో ఉంచితే ఆయా విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి వైరస్ సోకకుండా రక్షణ కల్పిస్తుందని ఆయన వివరించారు.

కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడానికి ఎయిమ్స్ సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తోంది. గత వారం ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ అభినవ్ వర్మ.. ఐఐటీ విద్యార్థి అయిన తన సోదరుడితో కలిసి ఓ యాప్‌ను అభివృద్ధి చేశారు. ప్లాస్మా అవసరం ఉన్న కరోనా రోగులు, దాతలను అనుసంధానం చేస్తూ ఈ యాప్‌ను రూపొందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.