యాప్నగరం

క‌ర్ణాట‌క‌లో జేడీఎస్‌కే మా మ‌ద్ద‌తు: ఒవైసీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టత ఇచ్చేశారు. ఎన్నికల్లో పోటీ చేయబోమన్న ఆయన.. జేడీఎస్‌ పార్టీకి మద్ధతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు

Samayam Telugu 24 Apr 2018, 3:10 pm
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టత ఇచ్చేశారు. ఎన్నికల్లో పోటీ చేయబోమన్న ఆయన.. జేడీఎస్‌ పార్టీకి మద్ధతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సోమవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు.
Samayam Telugu Asaduddin-Karnataka- ఎంఐఎం అధినేత
ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో జేడీఎస్ పార్టీకి మ‌ద్ద‌తిచ్చిన ఓవైసీ


‘ రెండు జాతీయ పార్టీలు(కాంగ్రెస్‌, బీజేపీలను ఉద్దేశిస్తూ..) కర్ణాటకలో పూర్తిగా విఫలమయ్యాయి. అభివృద్ధి జరగాలంటే బీజేపీ, కాంగ్రెస్‌ యేతర ప్రభుత్వం రావాలి. ఏఐఎంఐఎం జేడీఎస్‌కు మద్ధతు ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటాం. అవసరమైతే జేడీఎస్‌ తరపున బహిరంగ సభ నిర్వహిస్తాం’ అని అసదుద్దీన్‌ తెలిపారు. కాగా, గత కొన్ని రోజులుగా కర్ణాటక ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయాలని భావిస్తోందని.. ఈ మేరకు సీట్ల పంపిణీ కోసం అక్కడి రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపారంటూ కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.