యాప్నగరం

పావు గంటపాటు ప్రయాణికులను భయపెట్టిన విమానం!

అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వెళ్తోన్న ఎయిరిండియా విమానంలో జరిగిన ఓ ఘటనతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. గురువారం జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

TNN 22 Apr 2018, 12:35 pm
అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వెళ్తోన్న ఎయిరిండియా విమానంలో జరిగిన ఓ ఘటనతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. గురు వారం జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్‌లైన్ విమానంలోని విండో ప్యానెల్ విరిగిపడి ప్రయాణికులపై పడడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు ఏం జరుగుతోందో తెలియక ప్రయాణికులు భయాందోళనతో వణికపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు కూడా ఇదో మిస్టరీలా మారింది.
Samayam Telugu air india plane hits turbulence three injured window panel falls off
పావు గంటపాటు ప్రయాణికులను భయపెట్టిన విమానం!


అమృత్‌సర్ నుంచి విమానం బయలుదేరిన తర్వాత ఓ ప్రయాణికుడు సీటు బెల్టు ధరించకపోవడతో బంప్ ముందున్న కేబిన్‌ను బలంగా గుద్దుకున్నాడు. దీంతో 18- ఏ సీటు నెంబరు విండో ప్యానెల్ విరిగి పడి, అతడితోపాటు పక్కనే ఉన్న మరో ఇద్దరి ప్రయాణికులకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు బయటి విండో పగలకపోవడంతో పెను ముప్పు తప్పింది. దీంతో ప్రయాణికులు భయపడిపోయారు. 12- యూ సీటు నెంబర్ వద్ద ఓవర్ హెడ్ ప్యానెల్ పగలడంతో ఆక్సిజన్ మాస్కులు కిందపడి, వైర్లు సైతం వేలాడాయి. ఈ ఘటనతో ప్రయాణికులు మరింత భయపడిపోయారని ఎయిరిండియా‌కు చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

విమానం ఢిల్లీకి చేరుకున్న వెంటనే గాయపడిన వారికి హాస్పిటల్‌కు తరలించి ప్రథమ చికిత్స చేసినట్టు తెలిపారు. ఓవర్ హెడ్ ప్యానెల్‌ బలంగా తాకడంతో ఓ ప్రయాణికుడి తలపై కుట్లు పడినట్టు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న డీజీసీఏ, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డుకు తెలియజేసింది. మీడియాకు తెలిసే వరకు ఎయిరిండియా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం గమనార్హం. గతంలోనూ ఎయిరిండియా విమానంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 2014 అక్టోబరులో సింగపూర్ నుంచి ముంబై వస్తున్న విమానంలో జరిగిన ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. ముంబై విమానాశ్రయంలో ఎయిర్‌బస్ దిగుతుండగా అనుకోకుండా సమస్య తలెత్తడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.