యాప్నగరం

ఫాదరా? సొంత గూడా?: భవితవ్యం తేలేది రేపే

సమాజ్ వాదీ పార్టీ అధినేతగా తాను ప్రకటించిన 393 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో ములాయం సింగ్ యాదవ్ రేపు సమావేశం కానున్నారు.

TNN 30 Dec 2016, 3:34 pm
సమాజ్ వాదీ పార్టీ అధినేతగా తాను ప్రకటించిన 393 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో ములాయం సింగ్ యాదవ్ రేపు సమావేశం కానున్నారు. తండ్రి మాటను కాదని సీఎం అఖిలేష్ యాదవ్ 235 మంది అభ్యర్థులతో కూడిన మరో లిస్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
Samayam Telugu akhilesh future will be known tomorrow as mulayam holds meeting with his candidates
ఫాదరా? సొంత గూడా?: భవితవ్యం తేలేది రేపే


ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎస్పీ అధికారిక అభ్యర్థులుగా ఎవరు పోటీ చేయబోతున్నారో తెలియక పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.

ఈ నేపథ్యంలో ములాయం సింగ్ రేపు తుది లిస్టులో పేర్కొన్న క్యాండిడేట్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. రేపు అభ్యర్థులకు నిర్దేశించి దశదిశలపై తమ్ముడు శివపాల్ యాదవ్ తో ములాయం చర్చించారు.

పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను బేరీజు వస్తూ పార్టీ డైరెక్షన్స్ ఇవ్వడం కోసమే ములాయం రేపు సమావేశం ఏర్పాటు చేశారని పార్టీ సీనియర్లు తెలిపారు.

మరోవైపు అఖిలేష్ ప్రకటించిన 235 మంది అభ్యర్థులే ఫైనల్ అని..వారే ఎస్పీ గుర్తుపై పోటీ చేస్తారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటుంది.

అయితే అఖిలేష్ మాత్రం...రేపు ములాయం మీటింగ్ అనంతరం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం స్థాయిలో 235మంది అభ్యర్థుల లిస్టు ప్రకటించడం, వచ్చే ఎన్నికల్లో తనను సీఎం అభ్యర్థిగా ములాయం ఒప్పుకోకపోవడాన్ని అఖిలేష్ సీరియస్ గా తీసుకున్నారు.
అవసరమైతే తన వర్గాన్ని రెబల్ (తిరుగుబాటు) అభ్యర్థులుగా పోటీకి దింపడమా లేక.. ప్రజల సానుభూతి పొందేందుకు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యేదాకా వేచి చూద్దామా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. సస్పెండ్ వేటు పడ్డాక సొంతపార్టీ పెడితే ఎలా ఉంటుంది ఆయన యోచిస్తున్నారు.

ఎన్నికలు ఎంతో దూరంలో లేకపోవడంతో ఎస్పీ ఫ్యామిలీలో నెలకొన్న సంక్షోభం పార్టీ మొత్తాన్ని అనిశ్చితిలోకి నెట్టింది. కుటుంబ కలహాలు రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేశాయని మంత్రి ఆజం ఖాన్ విమర్శించారు. ‘ కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న బ్యాడ్ బ్లడ్...రాష్ట్ర భవిష్యత్ నే నాశనం చేసింది’ అని ఆయన మండిపడ్డారు.

మరోవైపు అధికార పార్టీలో నెలకొన్న ఫ్యామిలీ వార్ ను బీఎస్పీ, బీజేపీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.