యాప్నగరం

Delhi Municipal Exit Polls సామాన్యుడివైపే మొగ్గు.. 15 ఏళ్ల బీజేపీ పాలనకు బ్రేక్!

Delhi Municipal Exit Polls గుజరాత్ శాసనసభ ఎన్నికల తుది విడత పోలింగ్ సోమవారం ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పలు సంస్థలు విడుదల చేశాయి. ఢిల్లీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది పలు సంస్థలు సర్వే చేసి ఫలితాలను వెల్లడించాయి. ఈ ఎన్నికల్లోనూ ఢిల్లీ నగర ప్రజలు సామాన్యుడికే పట్టం కట్టబోతున్నారని, బీజేపీ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి పరిస్థితి నెలకుందని దాదాపు అన్ని సర్వేలు ఘంటాపథంగా వెల్లడించడం గమనార్హం.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 6 Dec 2022, 6:15 am

ప్రధానాంశాలు:

  • విలీనం తర్వాత ఢిల్లీలో తొలిసారి ఎన్నికలు
  • 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ
  • మరోసారి కేజ్రీవాల్ పనితీరుకు ఓటర్లు పట్టం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Delhi Exit Polls
Delhi Municipal Exit Polls ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలుపు తథ్యమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దాదాపు అన్ని సంస్థలూ సామాన్యుడికే మెజార్టీ సీట్లు దక్కుతాయని ఢంకాబజాయించాయి. ఈస్ట్, సౌత్, నార్త్ కార్పొరేషన్ల విలీనం తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన పోలింగ్‌లో 50 శాతం ఓటింగ్ నమోదైంది. 2017తో పోల్చితే ఓటింగ్ శాతం తగ్గింది. ఫలితాలను డిసెంబరు 7న వెల్లడించనున్నారు. ఢిల్లీ కార్పొరేషన్‌లో గత 15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి కూడా అధికారం నిలబెట్టుకోవాలనుకున్న కమలనాథుల ఆశలపై ఢిల్లీ ఓటర్లు నీళ్లుచల్లారా? అంటే అవునని అంటున్నాయి.
ఎగ్జిట్ పోల్స్. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఆప్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు ఎగ్జిట్‌పోల్స్‌ పేర్కొన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 43శాతం ఓట్లను పొందనుండగా.. బీజేపీ 35 శాతం ఓట్లను సాధించనున్నట్లు తెలిపాయి. కాంగ్రెస్‌ కేవలం 10 శాతానికే పరిమితం కానున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి.
ఆజ్ తక్- యాక్సిస్‌ మై ఇండియా
ఆప్‌: 149-171
బీజేపీ 69-91
కాంగ్రెస్‌ 3-7

టైమ్స్‌ నౌ-ఈటీజీ
ఆప్‌: 146-156
బీజేపీ: 84-94
కాంగ్రెస్: 6-10

న్యూస్‌ ఎక్స్‌-జన్‌కి బాత్‌:
బీజేపీ: 70-92
ఆప్‌: 159-175
కాంగ్రెస్‌: 3-7

జీ న్యూస్- బార్క్
ఆప్- 134-146
బీజేపీ 82-94
కాంగ్రెస్ 8-14

ఎన్డీటీవీ

ఆప్-155
బీజేపీ-84
కాంగ్రెస్-7

ఢిల్లీలో గెలిచి కేజ్రీవాల్‌కు చెక్ పెట్టాలనే సంకల్పంతో బీజేపీ నేతలు ముమ్మర ప్రచారం చేశారు. అనేక మురికివాడలను రెగ్యులరైజ్ చేయడంతో తమకు కలిసొస్తుందని బీజేపీ భావించింది. అలాగే, స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం సాగించింది. అటు, బీజేపీకి ధీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ సైతం వ్యూహాత్మకంగా ప్రచారం సాగించింది. అధికారంలోకి వస్తే కొద్ది కాలంలోనే అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తామని.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని పారిస్, న్యూయార్క్‌ల మాదిరిగా మారుస్తామని హామీ ఇచ్చింది.

ఇక, కాంగ్రెస్‌ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పేర్కొన్నాయి. 2019లో షీలా దీక్షిత్ మరణించిన తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్రమంగా దిగజారిపోయింది. కాగా, 2017 ఎన్నికల్లో బీజేపీ మొత్తం 181 డివిజన్లు, ఆప్ 48, కాంగ్రెస్ 30 డివిజన్లలో విజయం సాధించాయి.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.