యాప్నగరం

ఆ పేరు ఇక కనిపించదు.. యూపీ సీఎం కీలక నిర్ణయం

2019 జనవరి 15న కుంభమేళా ప్రారంభం కానుండగా.. అంతకుముందే అలహాబాద్ పేరును మార్చేయనున్నట్లు వివరించారు.

Samayam Telugu 14 Oct 2018, 8:48 pm
ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలోని ముఖ్య పట్టణమైన అలహాబాద్ పేరును మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది కుంభమేళాలోపే అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చనున్నట్లు ఆయన ప్రకటించారు. అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలంటూ స్థానిక ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను నెరవేర్చేందుకు యూపీ సీఎం సిద్ధంగా ఉన్నారు.
Samayam Telugu Yogi Adityanath


పేరు మార్పుపై సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియాతో మాట్లాడారు. అలహాబాద్‌‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్పు చేసేందుకు ఇచ్చిన తమ ప్రతిపాదనను గవర్నర్‌ రామ్ నాయక్ అంగీకరించారని తెలిపారు. వచ్చే ఏడాది కుంభమేళాకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించామన్నారు. 2019 జనవరి 15న కుంభమేళా ప్రారంభం కానుండగా.. అంతకుముందే అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చేయనున్నట్లు వివరించారు. అఖిల భారతీయ అఖారా పరిషత్ సభ్యులు, సాధువులు పేరు మార్పుపై ప్రభుత్వానికి విన్నవించుకున్న విషయం తెలిసిందే.

కాగా, యూపీలో యోగి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత మొగల్‌సరాయ్ జంక్షన్ పేరును దీన దయాళ్ జంక్షన్‌గా, మొగల్‌సరాయ్ పేరును దీన్ దయాళ్ నగర్‌గా మార్పు చేసింది. దీన్ దయాళ్ భారతీయ జనసంఘ్ సహవ్యవస్థాపకులలో ఒకరు. ప్రయాగ పేరును ఇలాహాబాద్‌గా మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ మార్చగా.. అనంతరం షాజహాన్ దాన్ని అహాబాద్‌గా నామకరణం చేసినట్లు ప్రచారంలో ఉంది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.