యాప్నగరం

మల్టీప్లెక్సుల్లోకి బయటి ఫుడ్ అనుమతిపై మహారాష్ట్ర ప్రభుత్వం యూ-టర్న్..

ఆగస్టు 1 నుంచి మల్టీప్లెక్సుల్లోకి బయటి ఆహారాన్ని తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు శాసనసభలో మంత్రి రవీంద్ర చౌహాన్ ప్రకటన కూడా చేశారు.

Samayam Telugu 8 Aug 2018, 5:03 pm
ఆగస్టు 1 నుంచి మల్టీప్లెక్సుల్లోకి బయటి ఆహారాన్ని తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు శాసనసభలో మంత్రి రవీంద్ర చౌహాన్ ప్రకటన కూడా చేశారు. అయితే ఆయన ప్రకటన చేసి నెలరోజులు కూడా గడువక ముందే.. మహారాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయంపై 'యూ-టర్న్' తీసుకుంది. మల్టీప్లెక్సుల్లోకి బయటి ఆహారాన్ని అనుమతిస్తే భద్రత ప్రమాదంలో పడుతుందని బాంబే హైకోర్టుకి తెలిపింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొనే ఉద్దేశమే తమకు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Samayam Telugu multiplex


అయితే.. మల్టీప్లెక్సులు, సినిమా హాళ్లలో మంచినీటిని ఉచితంగా అందించాలని.. ఆహారపదార్థాలు, ఇతర పానీయాలను ఎంఆర్పీ ధరలకే అమ్మాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు మంగళవారం (ఆగస్టు 7) హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ప్రభుత్వం తెలిపింది. మహారాష్ట్ర సినిమా (రెగ్యులేషన్స్) రూల్స్, 1966లో ప్రేక్షకులను బయటి వస్తువులు తెచ్చుకోకుండా అడ్డుకొనే నియమమేదీ లేదని ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. కానీ బయటి ఆహారపదార్థాలను అనుమతిస్తే గందరగోళ వాతావరణం ఏర్పడుతుందని, భద్రత ప్రమాదంలో పడుతుందని డీజీపీ అభిప్రాయ పడినట్లు కోర్టుకు తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం కూడా వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాలను ఎంఆర్పీ ధరలకు మించి అమ్మే మల్టీప్లెక్సులు, సినిమా హాళ్లపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అయితే బయటి ఫుడ్‌ను అనుమతించే విషయంపై.. బయటిఫుడ్‌ను అనుమతించిన మహారాష్ట్రలో వచ్చే ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయంపై యూటర్న్ తీసుకుంటూ.. కోర్టుకు విన్నవించిన నేపథ్యంలో తెలంగాణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.