యాప్నగరం

ఎస్పీలో విబేధాల నేపథ్యంలో అమర్ సింగ్‌కు భద్రత పెంపు

సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అమర్ సింగ్‌కు భద్రత పెంచుతూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.

TNN 8 Jan 2017, 4:45 pm
సమాజ్‌వాదీ పార్టీలో ముసలం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ములాయం సన్నిహితుడైన అమర్ సింగ్‌కు భద్రతను పెంచాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. తమకే సైకిల్ గుర్తు కేటాయించాలంటే.. తమకే కేటాయించాలంటూ అఖిలేష్, ములాయం వర్గాలు ఎన్నిక సంఘం వద్ద పోట్లాడుకుంటున్న ప్రస్తుత తరుణంలో అమర్ సింగ్‌కు జెడ్ కెటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.
Samayam Telugu amar singh gets z category cisf security cover
ఎస్పీలో విబేధాల నేపథ్యంలో అమర్ సింగ్‌కు భద్రత పెంపు


యూపీ అధికార పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీ ములాయం, అఖిలేష్ వర్గాలుగా చీలిన సంగతి తెలిసిందే. ములాయం వర్గంలో మిగిలిన కొద్ది మందిలో అమర్ సింగ్ ఒకరు. ఆయన మొదటి నుంచి ములాయంకు నమ్మిన బంటులా వ్యవహరిస్తున్నారు. పార్టీ చీలికకు అమర్ సింగే ప్రధాన కారణమని అఖిలేష్ వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచారు. ఇక నుంచి సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఆయనకు భద్రత కల్పించనున్నారు.

2008లో అమర్‌ సింగ్‌ కు జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత కల్పించారు. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమర్‌ సింగ్‌‌కు భద్రత కుదించింది. సమాజ్ వాదీ పార్టీలో తలెత్తిన తీవ్ర స్థాయి ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు తిరిగి ఆయనకు భద్రతను పెంచారు.

మెజార్టీ చట్టసభ్యుల మద్దతు తమకే ఉందని అఖిలేష్ ఇప్పటికే ఎన్నికల సంఘానికి సమాచారం అందించారు. శనివారం ఈసీని కలిసిన అనంతరం అఖిలేష్ బాబాయి రాంగోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. మెజార్టీ ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారని, అందుకే సైకిల్ గుర్తును తమకే కేటాయించాలని ఈసీని కోరామని తెలిపారు. కాగా, తమ ఎమ్మెల్యేల సంతకాలను అఖిలేష్ వర్గం ఫోర్జరీ చేసిందంటూ అమర్ సింగ్ ఆరోపించారు. పార్టీ గుర్తు అయిన సైకిల్ తమకే కేటాయించాలని కోరుతూ సోమవారం మధ్యాహ్నం ములాయంతోపాటు అమర్ సింగ్ ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.