యాప్నగరం

డోక్లామ్ ప్రతిష్టంభన: మరో రూ.20వేల కోట్లు కావాలి!

డోక్లామ్ ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా బలగాలను దీటుగా ఎదుర్కొనడానికి తమకు మరో రూ. 20వేల కోట్లు అవసరమని రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం కేంద్రాన్ని కోరింది.

TNN 9 Aug 2017, 11:45 am
డోక్లామ్ ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా బలగాలను దీటుగా ఎదుర్కొనడానికి తమకు మరో రూ. 20వేల కోట్లు అవసరమని రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం కేంద్రాన్ని కోరింది. ఈ మొత్తాన్ని తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. దాదాపు రెండునెలలుగా వివాదాస్పద డోక్లామ్‌ ప్రాంతంలో భారత్‌-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా బలగాల ఆధునీకరణ, రోజువారీ ఖర్చుల కోసం అదనపు బడ్జెట్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ కోరుతోంది.
Samayam Telugu amid doklam stand off mod seeks additional rs 20000 crore for combat readiness of armed forces
డోక్లామ్ ప్రతిష్టంభన: మరో రూ.20వేల కోట్లు కావాలి!


రక్షణ కార్యదర్శి సంజయ్ మిత్రా మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సమావేశమయ్యారని, తమకు తక్షణమే రూ. 20వేల కోట్లు అవసరమని చెప్పినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 2017-18 బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేంద్రం రూ. 2.74 లక్షల కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో రోజువారీ ఖర్చులు, జీతాల కోసం రూ. 1,72,774 కోట్లు కేటాయించగా.. నూతన ఆయుధాలు, ఆధునీకరణ తదితర వాటికోసం రూ.86,488 కోట్లు కేటాయించారు. అయితే ప్రస్తుత డోక్లామ్ వివాదం కారణంగా చాలా బడ్జెట్ అయిపోయిందని, కాబట్టి అదనంగా రూ.20 వేల కోట్లు కావాలని రక్షణ శాఖ కోరుతోంది.

కాగా, డోక్లామ్‌ ప్రతిష్టంభన నెలకొని 50 రోజులు దాటింది. నిజానికది భూటాన్‌ భూభాగం. సిక్కిం-భూటాన్-టిబెట్ సరిహద్దులో ఉంది. అక్కడ చైనా రోడ్డు నిర్మించే ప్రయత్నం చేయగా.. అది తమ ప్రయోజనాలకు భంగకరమని భారత్‌ అడ్డుపడింది. కానీ చైనా మాత్రం వివాదాన్ని పెద్దది చేసింది. భారీగా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) సైనికులను మోహరించి భారత్‌ను హెచ్చరిస్తోంది. డోక్లామ్‌ నుంచి భారత సైనికులు స్వచ్ఛందంగా, బేషరతుగా వెంటనే తప్పుకోవాలని డిమాండ్‌ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.